ఆలస్యం అవుతున్న ‘ప్రేమలు’ ఓటీటీ రిలీజ్.. ఎందుకంటే.?

గిరీష్ ఏడీ దర్శకత్వంలో వచ్చిన మలయాళ మూవీ ‘ప్రేములు’.

Update: 2024-03-29 14:41 GMT
ఆలస్యం అవుతున్న ‘ప్రేమలు’ ఓటీటీ రిలీజ్.. ఎందుకంటే.?
  • whatsapp icon

దిశ, సినిమా: గిరీష్ ఏడీ దర్శకత్వంలో వచ్చిన మలయాళ మూవీ ‘ప్రేమలు’. నస్లీన్, మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం కేవలం పది కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై దాదాపు వంద కోట్ల వసూళ్లను రాబట్టి మలయాళ సినీ చరిత్రలో హయ్యేస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ ఫైవ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే.. ఈ చిత్రాన్ని తెలుగు వెర్షన్ కూడా తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

దిగ్గజ దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ మూవీ తెలుగు వెర్షన్‌ను రూపొందించారు. అనూష్య రీతిలో ఇక్కడ కూడా ‘ప్రేమలు’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుని మంచి వసూళ్లను రాబడుతోంది. అయితే.. ఈ మూవీ మార్చి 29 నుంచి ‘ప్రేమలు’ మూవీ డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఇంతకు ముందే వార్తలు వచ్చాయి. దీంతో ఈ మూవీ కోసం యవత ఎంతో ఈగర్‌గా ఎదురుచూశారు. కానీ ఈ రోజు డిజిటల్ స్ట్రీమింగ్ కాకపోవడంతో నిరుత్సాహం చెందిన కొందరూ.. ‘ప్రేమలు’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటూ డిస్నీ హాట్ స్టార్‌ను ట్యాగ్ చేస్తూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అయితే.. ఈ మూవీ ఓటీటీ మరింత లేట్ అయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే..

‘ప్రేమలు’ తెలుగు వెర్షన్ మార్చి 8న థియేటర్లలో రిలీజ్ కాగా.. తమిళ వెర్షన్ మార్చి 15 న రిలీజ్ అయింది. ఇక ఇప్పుడుకి కూడా తెలుగు, తమిళ వెర్షల్లో ఈమూవీ థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది. అంతే కాకుండా మలయాళంతో పాటు, తెలుగు, తమిళంలో కూడా ఇంకా వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రాన్ని ఇప్పుడే ఓటీటీలో రిలీజ్ చెయ్యడం కరెక్ట్ కాదని నిర్మాతలు అడ్డుపడుతున్నారట. అందుకే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ ఇంకాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ఇక ఈ మూవీ నిర్మాతల రిక్వెస్ట్‌తో ‘ప్రేమలు’ చిత్రం ఏప్రిల్ రెండో వారంలో ఓటీటీలోకి వచ్చే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read More..

లేడీ గెటప్‌లో విశ్వక్ సేన్.. సినిమా టైటిల్ రిలీజ్

Tags:    

Similar News