'బాయ్‌కాట్‌' అంటే ఏంటో తెలియదు : వ్యంగ్యంగా స్పందించిన విక్రమ్

దిశ, సినిమా : బాలీవుడ్‌ బాయ్‌కాట్‌ వివాదంపై స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్‌ వ్యంగ్యంగా స్పందించాడు.

Update: 2022-08-28 13:43 GMT

దిశ, సినిమా : బాలీవుడ్‌ బాయ్‌కాట్‌ వివాదంపై స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్‌ వ్యంగ్యంగా స్పందించాడు. ఆయన లేటెస్ట్ ఫిల్మ్ 'కోబ్రా' ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన హీరో ఆసక్తికరంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మధ్య బాయ్‌కాట్‌ ట్రెండ్ పేరుతో పలు బాలీవుడ్‌ చిత్రాలను బహిష్కరణకు నెటిజన్స్‌ డిమాండ్ చేస్తున్నారు.

మీ అభిప్రాయం ఏంటి? అని ఓ విలేకరి ప్రశ్నించాడు. దీనికి తనదైన స్టైల్‌లో ఫన్నీ ఆన్సర్ ఇచ్చిన విక్రమ్‌.. 'అసల్‌ బాయ్‌కాట్‌ అంటే ఏమిటి? బాయ్‌ అంటే తెలుసు.. గర్ల్‌ అంటే బాగా తెలుసు.. చివరకు కాట్‌ అంటే కూడా తెలుసు కానీ 'బాయ్‌కాట్‌' పదమే నాకు తెలియదు' అని పేర్కొన్నాడు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వాళ్ల ముఖంపై నవ్వులు పూయగా ఈ ఇన్సిడెంట్‌పై హీరో అభిమానులు మురిసిపోతున్నారు. ఇక జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన 'కోబ్రా'ను సెవెన్ స్టూడియోస్ - రెడ్ జెయింట్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మించగా 'కేజీఎఫ్‌' బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది.

Tags:    

Similar News