EVOL Movie: సెన్సార్ బ్యాన్.. డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేస్తున్న బోల్డ్ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?
డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేస్తున్న బోల్డ్ సినిమా
దిశ, సినిమా : ఈ మధ్య ఓటీటీలకి డిమాండ్ బాగా పెరిగింది. కరోనా రాకపోయింటే వీటికి ఇంత క్రేజ్ వచ్చేది కాదు. ఒకప్పుడు థియేటర్లు కూడా లేక ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. బడ్జెట్ లేక చిన్న సినిమాలు తీసే వాళ్ళు ఓటీటీలనే నమ్ముకుంటున్నారు. ఇక్కడ కూడా వీటికి పోటిగా పెద్ద సినిమాలు వస్తున్నాయి. స్టార్ హీరోల మూవీస్ డైరెక్టుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఇలా రిలీజ్ అయినా సినిమాలు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఓ రొమాంటిక్ మూవీకి సెన్సార్ దెబ్బ తగలడంతో ఓటీటీలోకి రానుంది.
లవ్ అనే వర్డ్ ని తిరిగి రాస్తే ఎవోల్ అని వస్తుంది. ఇప్పుడు ఇదే టైటిల్‌తో రామ్ వెలగపూడి డైరెక్టర్ సినిమాని తెరకెక్కించాడు. ఈ మూవీని ముందుగా థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకున్నారు. అంతా మంచిగా ఉంటే ఈ మూవీ జూలై లోనే విడుదలయ్యేది.
అయితే.. తాజాగా ఈ మూవీని సెన్సార్ బోర్డు బ్యాన్ చేసింది. ఎందుకంటే ఈ సినిమాలో బోల్డ్ సీన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి ఓటీటీ ఆహా ఫ్లాట్‌ఫామ్‌లో ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నారు. దీనికి సంబందించిన అనౌన్స్ కూడా ఆహా అఫీషియల్ గా ప్రకటించింది. సెన్సార్ బ్యాన్ చేసేంతగా బోల్డ్ సీన్స్ ఏమున్నాయంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Read More..
రాజ్ తరుణ్-లావణ్య కేసులో సంచలన ట్విస్ట్.. తెరపైకి మస్తాన్ సాయి పేరు