Corona Crisis : కొడుకును చంపి.. తల్లిని కూడా వదల్లేదు..!
దిశ, బాన్సువాడ: కరోనా మహమ్మారి ప్రశాంతంగా ఉన్న కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. కరోనాతో కొడుకును బలి తీసుకున్న వైరస్.. 12 రోజుల వ్యవధిలోనే తల్లిని కూడా చంపేసింది. ఓ పక్క కొడుకు చిత్రపటం, మరోవైపు భార్య శవాన్ని చూసిన భర్త గుండెలు పలిగేలా ఏడుస్తున్నాడు. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ నూడా డైరెక్టర్ శ్రీహరి నాయక్ భార్య మీనా, కొడుకు నవీన్ గత కొద్దిరోజుల క్రితం […]
దిశ, బాన్సువాడ: కరోనా మహమ్మారి ప్రశాంతంగా ఉన్న కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. కరోనాతో కొడుకును బలి తీసుకున్న వైరస్.. 12 రోజుల వ్యవధిలోనే తల్లిని కూడా చంపేసింది. ఓ పక్క కొడుకు చిత్రపటం, మరోవైపు భార్య శవాన్ని చూసిన భర్త గుండెలు పలిగేలా ఏడుస్తున్నాడు. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే..
నిజామాబాద్ నూడా డైరెక్టర్ శ్రీహరి నాయక్ భార్య మీనా, కొడుకు నవీన్ గత కొద్దిరోజుల క్రితం కరోనా బారీన పడ్డాడు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి క్షీణించడంతో వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయినప్పటికీ, ఆరోగ్యం కుదుటపడలేదు. ఈ నేపథ్యంలోనే నవీన్ మే 14న మృతి చెందాడు. అప్పటికీ అదే ఆస్పత్రిలో కొవిడ్ చికిత్స పొందుతున్న తల్లి బిడ్డ మరణ వార్తను జీర్ణించుకోలేకపోయింది. దీనికితోడు కరోనాతో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినడంతో కొడుకు చనిపోయిన 12 రోజుల వ్యవధిలోనే.. మంగళవారం, మే 25న ప్రాణాలు విడిచింది. కొడుకు అకాల మరణంతో కృంగిపోయిన నూడా డైరెక్టర్ శ్రీహరికి కనీసం భార్య కూడా దక్కలేదని బంధువులు బోరున విలపించారు.