త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. నెలాఖరుకు షెడ్యూల్

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక షెడ్యూలు విడుదల కావడంతో.. త్వరలోనే ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ వెలువడనుంది. ఎమ్మెల్యేల కోటా కింద ఆరు ఎమ్మెల్సీ స్థానాలు గత కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్నాయి. వీటికి ఎన్నికలు నిర్వహించడానికి గతంలోనే రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కేంద్ర ఎలక్షన్ కమిషన్ కోరింది. ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేవని కారణాన్ని సాకుగా చూపింది. ఇప్పుడు హుజూరాబాద్ షెడ్యూల్ విడుదలైనందున త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా లైన్ […]

Update: 2021-09-28 19:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక షెడ్యూలు విడుదల కావడంతో.. త్వరలోనే ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ వెలువడనుంది. ఎమ్మెల్యేల కోటా కింద ఆరు ఎమ్మెల్సీ స్థానాలు గత కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్నాయి. వీటికి ఎన్నికలు నిర్వహించడానికి గతంలోనే రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కేంద్ర ఎలక్షన్ కమిషన్ కోరింది. ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేవని కారణాన్ని సాకుగా చూపింది. ఇప్పుడు హుజూరాబాద్ షెడ్యూల్ విడుదలైనందున త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా లైన్ క్లియర్ అయినట్లేనని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనసభ స్థానాల భర్తీ కోసం ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేసినందున.. అదే తీరులో వివిధ రాష్ట్రాల్లోని ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై కూడా త్వరలోనే నిర్ణయం ఉంటుందని శశాంక్ గోయల్ పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే ఒక సమావేశాన్ని నిర్వహించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. హుజూరాబాద్ సహా పలు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నిక ప్రక్రియ నవంబరు మొదటి వారంలో పూర్తికానున్నందున.. అది ముగిసేలోపు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందన్నారు.

డబుల్ డోస్ కంపల్సరీ

హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనే సిబ్బందిలోని ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ డబుల్ డోస్ తీసుకుని ఉండాల్సిందేనని శశాంక్ గోయల్ కండిషన్ పెట్టారు. పోలింగ్ స్టాఫ్‌తో పాటు అభ్యర్థులు, పార్టీల తరపున పనిచేసే పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లు విధిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఉండాలని, అప్పుడే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. పోలింగ్ స్టాఫ్‌కు మాత్రమే కాక ఓటర్లకు కూడా వీలైనంత ఎక్కువగా టీకాలు అందేలా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను స్పీడప్ చేయాలన్నారు.

దళితబంధుకు వర్తించని కోడ్

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధి కరీంనగర్, హన్మకొండ జిల్లాల పరిధిలో ఉన్నందున రెండు జిల్లాల్లోనూ ఎన్నికల కోడ్ తక్షణం అమల్లోకి వచ్చిందని సీఈఓ శశాంక్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకానికి ఎన్నికల కోడ్ వర్తించదని స్పష్టం చేశారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక ముఖచిత్రం

మొత్తం ఓటర్లు : 2,36,430
పురుష ఓటర్లు : 1,17,552
మహిళా ఓటర్లు : 1,18,716
ట్రాన్స్ జెండర్ : 1
ఎన్ఆర్ఐ ఓటర్లు : 14
సర్వీస్ ఓటర్లు : 147
ఫస్ట్ టైమ్ ఓటర్లు : 4,988
80 ఏళ్ళు దాటిన ఓటర్లు : 4,454
పోలింగ్ కేంద్రాలు : 305
వెయ్యికి మించిన ఓటర్ల పోలింగ్ కేంద్రాలు : 47

Tags:    

Similar News