ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్
దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో 3 స్థానాలకు, తెలంగాణలో 6 స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. నవంబర్ 9వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. 16వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 17వ తేదీన నామినేషన్ల పరిశీలన, 22వ తేదీన ఉపసంహరణ, 29వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. అదే […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో 3 స్థానాలకు, తెలంగాణలో 6 స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. నవంబర్ 9వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. 16వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 17వ తేదీన నామినేషన్ల పరిశీలన, 22వ తేదీన ఉపసంహరణ, 29వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని డిసెంబర్ 1వ తేదీలోగా పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులో పేర్కొంది. ఆంధ్ర ప్రదేశ్ లో మే 31న ఎమ్మెల్యే కోటాకు ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియగా, తెలంగాణలో జూన్ 3న ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసింది.
ఏపీలో ఎమ్మెల్సీలు చిన్న గోవిందరెడ్డి దేవసాని, మహ్మద్ అహ్మద్ షరీఫ్, సోము వీర్రాజుల పదవీకాలం ముగిసింది. తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఆకుల లలిత, గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, మొహమ్మద్ ఫరీదుద్దీన్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరిల పదవీకాలం పూర్తైంది. అయితే కేంద్రం ఎన్నికలు నిర్వహించాలని భావించి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం కోరింది. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలు నిర్వహించాలని కోరగా, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం కరోనా అదుపులోకి రాలేదని కొంత సమయం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అయితే నాలుగు నెలలు ఆలస్యమైంది. కరోనా అదుపులోకి వచ్చిందని భావించిన కేంద్ర ఎన్నికల సంఘం అందుకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మరోమారు ఎన్నికల కోలాహలం ప్రారంభం కానుంది. తెలంగాణలో ఖాళీ అయిన 6 స్థానాలు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందినవే కావడంతో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. 6 స్థానాలకు ఉమ్మడి పది జిల్లాల్లో పదుల సంఖ్యలో పోటీ పడుతున్నారు. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది.