కరీంనగర్ రిటర్నింగ్ అధికారి ముందే వాగ్వివాదం..?

దిశ ప్రతినిధి, కరీంనగర్: నామినేషన్ల పరిశీలన రోజున కరీంనగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముందు స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. బుధవారం ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు చేరుకున్న వేములవాడ టీఆర్ఎస్ నాయకులు, రెబెల్ అభ్యర్థులు గొడవకు దిగినట్టుగా సమాచారం. రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాదాసు వేణును ప్రతిపాదించిన కౌన్సిలర్ల సంతకాలు ఫోర్జరీ చేశారంటూ అధికార పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయగా, సంబంధం లేని మీరెలా రిటర్నింగ్ అధికారి వద్దకు వచ్చారంటూ మాదాసు […]

Update: 2021-11-24 10:40 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: నామినేషన్ల పరిశీలన రోజున కరీంనగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముందు స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. బుధవారం ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు చేరుకున్న వేములవాడ టీఆర్ఎస్ నాయకులు, రెబెల్ అభ్యర్థులు గొడవకు దిగినట్టుగా సమాచారం. రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాదాసు వేణును ప్రతిపాదించిన కౌన్సిలర్ల సంతకాలు ఫోర్జరీ చేశారంటూ అధికార పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయగా, సంబంధం లేని మీరెలా రిటర్నింగ్ అధికారి వద్దకు వచ్చారంటూ మాదాసు వేణుతో పాటు ప్రతిపాదకులు ఎదురు ప్రశ్నించారు.

దీంతో ఇరు వర్గాల మాధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. చివరకు వేణును ప్రతిపాదించింది తామేనని రిటర్నింగ్ అధికారి ముందు వాంగ్మూలం ఇవ్వడంతో నామినేషన్‌ను ఆమోదించారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్ రమణ నామినేషన్ పత్రాలతో ఇచ్చిన అఫిడవిట్ సరిగా లేదని కూడా వేములవాడకు చెందిన వారు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఆయన గత ఫిబ్రవరి నెల వరకే వివరాలను అఫిడవిట్‌లో పొందు పర్చారని, నిబంధన ప్రకారం నవంబర్ వరకూ ఉండాలన్న విషయాన్ని గుర్తు చేశారు. దీంతో రమణ వేసిన కొన్ని సెట్ల నామినేషన్లు తిరస్కరణకు గురి కాగా చివరకు ఒక సెట్‌ను ఆమోదించారు.

చెన్నమనేనికి షాకిచ్చిన ప్రియ శిష్యులు

వేములవాడ నియోజకవర్గ రాజకీయాల్లో చెన్నమనేని రమేష్ బాబుకు ప్రియ శిష్యులుగా గుర్తింపు పొందిన వారే నేడు రెబల్స్‌గా వ్యవహరిస్తుండడం సంచలనం కల్గిస్తోంది. గురు శిష్యుల మధ్య ఉన్న అన్యోన్యతను చూసిన స్థానికులు ఔరా అనుకున్న వారే నేడు వీరి మధ్య అంతరం పెరగడానికి కారణాలు ఏంటీ అని చర్చించుకుంటున్నారు. చందుర్తి మండలం సనుగుల ఎంపీటీసీ సభ్యుడు మాదాసు వేణు, అతనికి ప్రాతిపాదకులుగా ఉన్న వారిలో గోలి మహేష్, నిమ్మశెట్టి విజయ్‌లు చెన్నమనేని రమేష్ బాబు అడుగుజాడల్లోనే ఇంతకాలం నడిచారు. ఉద్యమ ప్రస్థానం నుండి గులాబీ జెండాతోనే అనుబంధం పెనవేసుకున్న వీరు ఉన్నట్టుండి తిరుగుబావుటా ఎగురేయడం వేములవాడలో హాట్ టాపిక్‌గా మారింది. రమేష్ బాబుతో అత్యంత సన్నిహితంగా మెదిలిన వీరే ఆయనకు వ్యతిరేకంగా జట్టు కట్టడం, ఏకంగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలస్తుండడం అంతుచిక్కకుండా తయారైంది.

Tags:    

Similar News