MLC పోలింగ్ తీరు ఎలా ఉండబోతోంది.. ఒక్కొక్కరు ఎన్ని ఓట్లు వేయాలో తెలుసుకోండిలా..?
దిశ ప్రతినిధి, కరీంనగర్ : చాలా కాలం తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ అసలు ఎలా సాగనుంది. ఇందులో ఎవరెవరు ఓట్లేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరు ఎన్ని ఓట్లు వేయాలి..? ఎలా వేయాలి..? పోలింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉంటాయన్న వివరాలు తెలుసుకోవాలని ఉందా? మీ కోసమే ఈ స్టోరీ.. ఇంకెందుకు ఆలస్యం చదివి తెలుసుకోండి. ప్రస్తుతం రాష్ట్రంలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు 6 ఏకగ్రీవం కాగా, మిగిలిన ఆరు స్థానాలకు […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : చాలా కాలం తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ అసలు ఎలా సాగనుంది. ఇందులో ఎవరెవరు ఓట్లేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరు ఎన్ని ఓట్లు వేయాలి..? ఎలా వేయాలి..? పోలింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉంటాయన్న వివరాలు తెలుసుకోవాలని ఉందా? మీ కోసమే ఈ స్టోరీ.. ఇంకెందుకు ఆలస్యం చదివి తెలుసుకోండి. ప్రస్తుతం రాష్ట్రంలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు 6 ఏకగ్రీవం కాగా, మిగిలిన ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ‘దిశ’ పాఠకుల కోసమే ఈ ప్రత్యేక కథనం..
ఓటర్లు వీరే..
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పోరేటర్లు, మేయర్లు, కౌన్సిలర్లు, మునిసిపల్ ఛైర్మన్లు మాత్రమే ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 1,324 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఉన్నారు. వీరు ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అనగా భూపాలపల్లి జిల్లాలో చేరిన మహదేవపూర్ సబ్ డివిజన్‌లోని ఐదు మండలాలు, సిద్దిపేట జిల్లాలో కలిసిన హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, హన్మకొండ జిల్లాలో కలిసిన అన్ని మండల్లాలోని ప్రజా ప్రతినిధులు ఇద్దరు ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉంటుంది.
ఓట్లు ఎలా వేయాలి..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఒక్కో ఓటరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. బ్యాలెట్ విధానంలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్‌లో అభ్యర్థుల పేర్లు మాత్రమే ఉంటాయి. వారికి నచ్చిన అభ్యర్థి పక్కన రైట్ మార్క్ వేయాల్సి ఉంటుంది. అయితే, ఓటర్లకు ఎన్నికల కమిషన్ పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా స్కెచ్‌లను ఏర్పాటు చేస్తుంది. వాటితోనే ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది.
పోలింగ్ కేంద్రాలివే..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,324 మంది ఓటర్లు ఉండగా.. వీరంతా కరీంనగర్ జిల్లా కేంద్రానికే వచ్చి ఓటు వేయాల్సిన అవసరం లేదు. వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేకంగా ఆయా ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వి కర్ణన్ ఏర్పాటు చేశారు. మొత్తం 8 చోట్ల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల వారు తమ సమీపంలోని పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి. కరీంనగర్‌లో 205 , హుజురాబాద్‌లో 180, జగిత్యాలలో 220 , కోరుట్లలో 146 , పెద్దపల్లిలో 208 , మంథనిలో 98 , సిరిసిల్లలో 201 , హుస్నాబాద్‌లో 66 మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.