తాండూరులో భగీరథ పైపులకు సోకిన అతిసార..?

దిశ, తాండూరు: తాండూరు పట్టణంలో మిషన్ భగీరథ తాగునీరు లీకేజీలతో రోడ్లపై వృథాగా ప్రవహిస్తూ నదులను తలపిస్తున్నాయి. గత వారం క్రితం తాండూరు పట్టణంలో అతిసార ప్రబలి ప్రజలు కోలుకుంటున్న సంఘటన మరువకముందే మళ్లీ మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీలు కావడంతో ప్రజలు భగీరథ పైపులకు అతిసార ప్రబలిందా అంటూ అధికారులపై విమర్శలు గుప్పిస్తున్నారు. మున్సిపల్ పాత కార్యాలయం వెనుకభాగంలో మిషన్ భగీరథ పైపులైన్ పనులు కొనసాగుతున్నాయి. గురువారం సాయంత్రం మున్సిపల్ ట్యాంకు నుంచి నీరు […]

Update: 2021-12-09 08:15 GMT

దిశ, తాండూరు: తాండూరు పట్టణంలో మిషన్ భగీరథ తాగునీరు లీకేజీలతో రోడ్లపై వృథాగా ప్రవహిస్తూ నదులను తలపిస్తున్నాయి. గత వారం క్రితం తాండూరు పట్టణంలో అతిసార ప్రబలి ప్రజలు కోలుకుంటున్న సంఘటన మరువకముందే మళ్లీ మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీలు కావడంతో ప్రజలు భగీరథ పైపులకు అతిసార ప్రబలిందా అంటూ అధికారులపై విమర్శలు గుప్పిస్తున్నారు. మున్సిపల్ పాత కార్యాలయం వెనుకభాగంలో మిషన్ భగీరథ పైపులైన్ పనులు కొనసాగుతున్నాయి. గురువారం సాయంత్రం మున్సిపల్ ట్యాంకు నుంచి నీరు సరఫరా అయ్యే పైపులైన్ ధ్వంసం కావడంతో ఒక్కసారిగా మిషన్ భగీరథ నీరంతా భారీ ఉధృతితో ప్రవహించి రోడ్లు నదిలాగా దర్శనమిస్తూన్నాయి. నీరంతా.. కార్యాలయం వెనుభాగం, పక్క నుంచి వరదలా ప్రవహించింది. రోడ్లపై నీరు పొంగిపొర్లడంతో వ్యాపారులు, దుకాణ సముదాయాల వ్యాపారులు, కాలినడకన వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Tags:    

Similar News