వాటర్ ఫౌంటెయిన్‌ను తలపిస్తున్న భగీరథ నీరు
దిశ,మానకొండూరు: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో భూమిపై నుండి నీళ్లు నింగికెగిశాయి. గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైను లీక్ కావడంతో వాటర్ ఫౌంటెన్‌లా ఎగిసిపడ్డాయి. హై స్పీడ్‌గా వస్తున్న భగీరథ నీరు ఉవ్వెత్తును ఎగిసిపడి ఆకాశాన్ని తాకినట్లు తలపిస్తున్నాయి. నీరంతా వృథాగా పోతుండడంతో తమకు తాగునీరు ఎలా అని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగి లీక్ అవుతున్న నీటిని కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.