అంత బెంబేలెత్తిపోయేలా చేసేది కాదు : కేటీఆర్

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరోనా వైరస్‌ను పారదొలాలంటే మనో ధైర్యం ఎంతో ముఖ్యమని మానసిక సంఘర్షణకు లోను కాకూడదని మంత్రి కేటీఆర్ కోరారు. సోమవారం సిరిసిల్లలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హోం మంత్రి మహుమూద్ అలీ, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు లాంటి పెద్ద వయసు ఉన్న వారికి కరోనా వైరస్ సోకినా తిరిగి ఆరోగ్యవంతులయ్యారన్నారు. హైదరాబాద్‌లో వృద్ద దంపతులు తమ వల్ల కరోనా సోకుతుందేమోనని ఆత్మహత్యకు పాల్పడడం […]

Update: 2020-08-03 09:36 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరోనా వైరస్‌ను పారదొలాలంటే మనో ధైర్యం ఎంతో ముఖ్యమని మానసిక సంఘర్షణకు లోను కాకూడదని మంత్రి కేటీఆర్ కోరారు. సోమవారం సిరిసిల్లలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హోం మంత్రి మహుమూద్ అలీ, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు లాంటి పెద్ద వయసు ఉన్న వారికి కరోనా వైరస్ సోకినా తిరిగి ఆరోగ్యవంతులయ్యారన్నారు.

హైదరాబాద్‌లో వృద్ద దంపతులు తమ వల్ల కరోనా సోకుతుందేమోనని ఆత్మహత్యకు పాల్పడడం తనను బాధించిందన్నారు. ఈ వ్యాధి అంత బెంబెలెత్తిపోయేలా చేసేది కాదని, రాగానే జాగ్రత్తలు తీసుకుంటే రికవరీ అయి తీరుతామన్నారు. కరోనా బారిన పడి చనిపోయిన వారు ఒక శాతం మాత్రమేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని మనో ధైర్యంతో ఉండాలన్నారు. రానున్న కాలంలో కరోనాతో సహజీవనం చేయడం తప్పదని వ్యాక్సిన్ లేదా మందు వచ్చే వరకూ ఈ పరిస్థితే నెలకొంటుందన్నారు. ప్లాస్మా డొనేషన్ ఇచ్చేందుకు రాజకీయ నాయకులు ముందుకు వచ్చి ఆదర్శంగా నిలవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాలతో పొలిస్తే తెలంగాణాలో కరోనా వల్ల చనిపోయే వారి సంఖ్య చాలా తక్కువేనన్నారు.

సిరిసిల్ల ఆసుపత్రి డెవలప్ మెంట్ సొసైటీకి సీఎస్సార్ నిధుల ద్వారా రూ. 2.28 కోట్ల మంజూరు చేసినట్టు, తనవంతు సాయంగా రూ. 20 లక్షలు కెటాయించినట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కరోనా మరింత విజృంభిస్తే అవసరమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదనపు సిబ్బందిని నియమించుకుంటున్నామని, అవసరమైతే ఆయూష్ వంటి ఇతర విభాగాల్లో పనిచేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బంది సేవలు కూడా వినియోగించుకుంటామని మంత్రి తెలిపారు.

Tags:    

Similar News