బీజేపీ విద్వేషాలు సృష్టిస్తోంది: మంత్రి కొప్పుల ఈశ్వర్

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలను సృష్టిస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్​ పేర్కొన్నారు. రైతులను మోసం చేసేందుకు కుట్రలకు పాల్పడుతుందని ఆయన మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు కొనసాగుతుంటే, అనవసరంగా ఘర్షణలకు తెరలేపుతుందని మండిపడ్డారు. దండుగ అనుకున్న వ్యవసాయాన్ని టీఆర్‌ఎస్​ప్రభుత్వం పండుగ చేసిందన్నారు. పంట పెట్టుబడికి రైతుబంధు కింద 44వేల కోట్లిచ్చామన్నారు. రైతుబీమా ద్వారా 2,900 కోట్లకు పైగా రైతులకు అందించామన్నారు. 24గంటల ఉచిత విద్యుత్ కోసం ఏటా […]

Update: 2021-11-16 08:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలను సృష్టిస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్​ పేర్కొన్నారు. రైతులను మోసం చేసేందుకు కుట్రలకు పాల్పడుతుందని ఆయన మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు కొనసాగుతుంటే, అనవసరంగా ఘర్షణలకు తెరలేపుతుందని మండిపడ్డారు. దండుగ అనుకున్న వ్యవసాయాన్ని టీఆర్‌ఎస్​ప్రభుత్వం పండుగ చేసిందన్నారు. పంట పెట్టుబడికి రైతుబంధు కింద 44వేల కోట్లిచ్చామన్నారు.

రైతుబీమా ద్వారా 2,900 కోట్లకు పైగా రైతులకు అందించామన్నారు. 24గంటల ఉచిత విద్యుత్ కోసం ఏటా 10వేల కోట్లను సబ్సీడి చేస్తున్నామన్నారు. కానీ బీజేపీ కావాలనే రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఎంపీ సంజయ్ వందలాది మంది తన గుండాలతో నల్లగొండ జిల్లాకు వెళ్లడాన్ని, రైతులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. బండి సంజయ్ ఇప్పటికైనా తన తప్పును గ్రహించి క్షమాపణలు చెప్పాలని మంత్రి కోరారు. అంతేగాక పండించిన పంట మొత్తాన్ని కోనుగోలు చేస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

చెరువులను కాపాడుతున్నాం..

మిషన్ కాకతీయ ద్వారా 46 వేల చెరువులను బాగు చేయడం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సాగునీరు పుష్కలంగా అందుబాటులోకి వచ్చిందన్నారు. నీటి తీరువా పన్నును పూర్తిగా ఎత్తేశామన్నారు. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే నకిలీ విత్తనాలను పూర్తిగా అరికట్టామని, సరఫరా చేసే వారిపై పీడీ యాక్ట్​ కేసులు పెడుతున్నామన్నారు.

Tags:    

Similar News