కరోనా నివారణకు కొత్త పిచికారీ యంత్రం
దిశ, నల్లగొండ : సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో కరోనా వైరస్ నియంత్రణకు రసాయన ద్రవం పిచికారీ చేసే యంత్రాన్ని అధికారులు కొనుగోలు చేశారు.రూ.8.50 లక్షల విలువ కలిగిన ఈ అధునాతన యంత్రం ద్వారా 20 మీటర్ల దూరంలో ద్రవం పిచికారీతో పాటు, గంటకు 1000లీటర్ల రసాయనం వెదజల్లే సామర్థ్యం దీనికి ఉందన్నారు. మున్సిపల్ సిబ్బంది పోరాటం మరువలేనిది.. కరోనా కట్టడికి సూర్యాపేట మున్సిపల్ పాలక వర్గం, సిబ్బంది ,అధికారులు రాజీ లేని పోరాటం చేస్తున్నారని, వారి కృషి […]
దిశ, నల్లగొండ :
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో కరోనా వైరస్ నియంత్రణకు రసాయన ద్రవం పిచికారీ చేసే యంత్రాన్ని అధికారులు కొనుగోలు చేశారు.రూ.8.50 లక్షల విలువ కలిగిన ఈ అధునాతన యంత్రం ద్వారా 20 మీటర్ల దూరంలో ద్రవం పిచికారీతో పాటు, గంటకు 1000లీటర్ల రసాయనం వెదజల్లే సామర్థ్యం దీనికి ఉందన్నారు.
మున్సిపల్ సిబ్బంది పోరాటం మరువలేనిది..
కరోనా కట్టడికి సూర్యాపేట మున్సిపల్ పాలక వర్గం, సిబ్బంది ,అధికారులు రాజీ లేని పోరాటం చేస్తున్నారని, వారి కృషి మరువలేనిదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరికీ నిత్యావసరాలు, మందులు, ఇతరత్రా వస్తువుల కొరత లేకుండా సకాలంలో మున్సిపల్ సిబ్బంది స్పందించి తమ కమిట్‌మెంట్ చాటుకున్నారని వివరించారు. లాక్‌డౌన్ పీరియడ్‌ను కేరింగ్ పీరియడ్‌గా తీసుకుని రానున్న రోజుల్లో వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. వలస కూలీలు, నిరాశ్రయులకు ప్రభుత్వం చేస్తున్న సహాయానికి తోడుగా దాతలు, ఎన్జీవో, స్వచ్చంద సంస్థలు అందిస్తున్న సహకారం అమోఘమని కొనియాడారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ అన్నపూర్ణ, కమిషనర్ రామనుజుల రెడ్డి, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, కౌన్సిలర్లు భరత్, దిలీప్ రెడ్డి, తాయర్ పాషా, నిమ్మల స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
Tags: spray machine, suryapet municipality rs.8.50lac, coronavirus, restrictions, lockdown