నాలుగు నెలల్లో మహిళా భవనాలు వస్తాయ్ : మంత్రి హరీష్ రావు
దిశ, జమ్మికుంట: త్వరలో జరగబోయే హుజురాబాద్ ఉపఎన్నికల్లో పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం ఇల్లందకుంట మండల కేంద్రంలో స్వశక్తి మహిళా సంఘాలకు రూ.11 కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వశక్తి సంఘాల మహిళలకు ఒక్క రూపాయి బాకీ లేకుండా వడ్డీ రుణాలను అందజేస్తున్నామని, ఇల్లందకుంట మండలానికి సంబంధించి రూ.3.14 కోట్ల రూపాయలు వచ్చినట్లు స్పష్టం చేశారు. 17 ఏళ్లు […]
దిశ, జమ్మికుంట: త్వరలో జరగబోయే హుజురాబాద్ ఉపఎన్నికల్లో పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం ఇల్లందకుంట మండల కేంద్రంలో స్వశక్తి మహిళా సంఘాలకు రూ.11 కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వశక్తి సంఘాల మహిళలకు ఒక్క రూపాయి బాకీ లేకుండా వడ్డీ రుణాలను అందజేస్తున్నామని, ఇల్లందకుంట మండలానికి సంబంధించి రూ.3.14 కోట్ల రూపాయలు వచ్చినట్లు స్పష్టం చేశారు.
17 ఏళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక్క మహిళ సంఘం భవనం నిర్మించలేదని, రానున్న నాలుగు నెలల వ్యవధిలో ప్రతీ గ్రామంలో మహిళ భవనాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు, బలహీనవర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. త్వరలోనే 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు ఇస్తామని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రూ. 2 వేల పింఛన్లు ఇస్తున్నారా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో మీకు తెలుసునని పేర్కొన్నారు. న్యాయం, ధర్మం వైపు నిలబడి కష్టపడే వాళ్లను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ తదితరులు పాల్గొన్నారు.