గెలుపు శీను కాదు.. 'గెల్లు' శీనే!

దిశ, హుజురాబాద్ రూరల్ : ప్రతిష్టాత్మకంగా జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఉద్యమకారుడు వర్సెస్ ఉద్యమకారుడు, బీసీ వర్సెస్ బీసీ సామాజిక వర్గాల అభ్యర్థులు పోటీ పడ్డారు. కాగా, ఈ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శీనును మంత్రి హరీశ్ రావు పొగిడారు. పలు సభలు, సమావేశాల్లో మాట్లాడిన హరీశ్ రావు.. ఇప్పటి వరకు గెల్లు శీను అని ఎన్నికల తర్వాత గెలుపు శీను అంటూ సంభోదించారు. కానీ ఫలితాల తర్వాత గెలుపు శీను గెల్లు […]

Update: 2021-11-03 01:06 GMT

దిశ, హుజురాబాద్ రూరల్ : ప్రతిష్టాత్మకంగా జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఉద్యమకారుడు వర్సెస్ ఉద్యమకారుడు, బీసీ వర్సెస్ బీసీ సామాజిక వర్గాల అభ్యర్థులు పోటీ పడ్డారు. కాగా, ఈ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శీనును మంత్రి హరీశ్ రావు పొగిడారు. పలు సభలు, సమావేశాల్లో మాట్లాడిన హరీశ్ రావు.. ఇప్పటి వరకు గెల్లు శీను అని ఎన్నికల తర్వాత గెలుపు శీను అంటూ సంభోదించారు. కానీ ఫలితాల తర్వాత గెలుపు శీను గెల్లు శ్రీనివాస్ గానే మిగిలారు. సాంకేతికంగా గెల్లు ఓడినా ఆ ఓటమి ఆయనది కాదని, అది ఇక్కడ ఇన్‌చార్జిలుగా వ్యవహరించిన వారి ఖాతాల్లో చేరుతుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

Tags:    

Similar News