‘సిద్దిపేట టీఆర్ఎస్‌కు అడ్డా కావాలి’
దిశ సిద్దిపేట: ఆకలి అయినప్పుడు అన్నం పెట్టేటోడు కావాలా… ఓట్ల అప్పుడు వచ్చే పార్టీ మనుషులు కావాలా అని మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో ఓటర్ల ను ప్రశ్నించారు. సిద్దిపేట పట్టణంలోని 31, 15 వార్డులు జంగిటి కనకరాజు, పాతురి సులోచన శ్రీనివాస్ రెడ్డి లకు మద్దతు గా ఏన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈసందర్భంగా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పట్టణంలో మహిళా భవనాలు కట్టించామని, ఒకనాడు నీళ్లు దొరకని సిద్దిపేటలో నేడు […]
దిశ సిద్దిపేట: ఆకలి అయినప్పుడు అన్నం పెట్టేటోడు కావాలా… ఓట్ల అప్పుడు వచ్చే పార్టీ మనుషులు కావాలా అని మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో ఓటర్ల ను ప్రశ్నించారు. సిద్దిపేట పట్టణంలోని 31, 15 వార్డులు జంగిటి కనకరాజు, పాతురి సులోచన శ్రీనివాస్ రెడ్డి లకు మద్దతు గా ఏన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈసందర్భంగా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పట్టణంలో మహిళా భవనాలు కట్టించామని, ఒకనాడు నీళ్లు దొరకని సిద్దిపేటలో నేడు ఇంటింటికి మంచినీళ్లు అందిస్తున్నామన్నారు. అలానే యూజీడీ ద్వారా మురుగు నీరు పంపి పట్టణాన్ని అందంగా 270 కోట్లతో అభివృద్ధి చేసుకున్నామని వివరించారు.
కొద్ది రోజుల్లోనే దోమలు లేని పట్టణంగా తయారు చేసుకున్నామని, పందులు, కోతుల సమస్య లేకుండా చేశామన్నారు. ఇక కుక్కల సమస్య తీర్చేందుకు కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ దవాఖానను రూ.60 లక్షలతో నిర్మించినట్లు వివరించారు. మీప్రతి అవసరాన్ని ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నామని ,ఇంటిముందుకే చెత్త బండి వచ్చి తడి పొడి చెత్త ను వేరుచేసి సేకరిస్తున్నామని అన్నారు. శుద్దిపేటగా సిద్దిపేటను మార్చుకున్నాం, వైద్యం మెరుగుపరిచాం, ఆసుపత్రికి వచ్చే తల్లి బిడ్డకు వేడి వేడి అన్నం పెడుతున్నాం, కార్పొరేట్ స్థాయిలో పేదలకు ప్రభుత్వ వైద్యం, పెన్షన్ ను 2016 చేసాం, ఎర్ర చెరువు ను అద్దంలా తీర్చిదిద్దాం, కళ్యాణ లక్ష్మి, సీఎం సహాయ నిధి తో ఎంతోమందిని ఆదుకున్నామని పేర్కొన్నారు.
నాతో నడిచే వ్యక్తిని ఎన్నుకోండి అటూ మంత్రి ఓటర్ల ను వేడుకున్నారు. ఓట్ల కోసం పెట్టె కోతి దండాలను నమ్మొద్దు అని మీ గౌరవాన్ని ఎప్పుడు పెంచేవాడిని నేను, మండు టెండల్లో చెరువులు మత్తడి దుముకుతున్నాయి, సిద్దిపేట టీఆర్ఎస్ కు అడ్డా కావాలన్నారు. నాకు కొండంత ధైర్యం ఉండాలంటే టీఆర్ఎస్ అభ్యర్థికి అండగా నిలవాలన్నారు. విడిపోతే నష్టపోతాం… కలిసి ఉంటే అభివృద్ధి సాధిస్తామన్నారు. ఇక మిగిలింది ఉద్యోగ కల్పన జరగాలి ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏడాది వరకు సిద్దిపేటకు చుకు చుకు రైలు రాబోతుందన్నారు. కప్పల కుంట ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి అర్హుడికి ఇంటిని ఇస్తున్నామని, కాళీ స్థలంలో ఇంటి నిర్మాణానికి డబ్బులు అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు.