వరద ప్రభావం తగ్గిన తరువాత సర్వే చేస్తాం

దిశ ప్రతినిధి, కరీంనగర్: నిరంతరంగా కురుస్తున్న వర్షాలతో వరద ఉధృతి తీవ్రంగా ఉందని, వరదలు తగ్గిన తరువాత నష్టంపై సమగ్రంగా సర్వే చేయిస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. వర్షాలతో శిథిలమైన ఇళ్లు, నీట మునిగిన పంట పొలాల గురించి ప్రత్యేకంగా వివరాలు సేకరిస్తామని, బాధితులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరారు. అన్ని ప్రభుత్వ శాఖల యంత్రాంగం క్షేత్ర స్థాయిలో సహాయక చర్యల్లో నిమగ్నం అయిందని, అధికార యంత్రాంగం నుంచి ఎప్పటికప్పుడు వివరాలు […]

Update: 2020-08-16 09:38 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: నిరంతరంగా కురుస్తున్న వర్షాలతో వరద ఉధృతి తీవ్రంగా ఉందని, వరదలు తగ్గిన తరువాత నష్టంపై సమగ్రంగా సర్వే చేయిస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. వర్షాలతో శిథిలమైన ఇళ్లు, నీట మునిగిన పంట పొలాల గురించి ప్రత్యేకంగా వివరాలు సేకరిస్తామని, బాధితులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరారు.

అన్ని ప్రభుత్వ శాఖల యంత్రాంగం క్షేత్ర స్థాయిలో సహాయక చర్యల్లో నిమగ్నం అయిందని, అధికార యంత్రాంగం నుంచి ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నామని మంత్రి వెల్లడించారు. బాధితలందరినీ ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.

Tags:    

Similar News