ఎడ్ల బండి మీదొచ్చి.. ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి గంగుల
దిశ, కరీంనగర్ సిటీ: రాష్ట్రంలోని రైతాంగాన్ని అయోమయంలోకి నెట్టి వారికి తీవ్ర నష్టాన్ని కలుగజేసి, రాజకీయ పబ్బం గడుపుకునే నీచ ఆలోచనలతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లపై అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ శుక్రవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతుల అయోమయ పరిస్థితిని, ఆందోళనలను తగ్గించాల్సిన బాధ్యత గల కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ప్రకటన […]
దిశ, కరీంనగర్ సిటీ: రాష్ట్రంలోని రైతాంగాన్ని అయోమయంలోకి నెట్టి వారికి తీవ్ర నష్టాన్ని కలుగజేసి, రాజకీయ పబ్బం గడుపుకునే నీచ ఆలోచనలతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లపై అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ శుక్రవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతుల అయోమయ పరిస్థితిని, ఆందోళనలను తగ్గించాల్సిన బాధ్యత గల కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ప్రకటన చేయకపోవడం శోచనీయమన్నారు. రాజ్యాంగం ప్రకారం ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదేనని, కేంద్ర ప్రభుత్వ ప్రకటన కోసం రైతులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని, బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఎంఎల్ సీ నారదాసు లక్ష్మణరావు, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, నగర కార్పొరేటర్లు, వివిధ గ్రామాల నుంచి తరలి వచ్చిన కార్యకర్తలు పాల్గొన్నారు.