కరీంనగర్‌లో రెమిడెసివిర్‌పై నజర్.. మంత్రి గంగుల కీలక ఆదేశాలు

దిశ ప్రతినిధి, కరీంనగర్: జిల్లాలో రెమిడెసివిర్‌, ఆక్సిజన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్‎లో కరోనా కట్టడిపై రివ్యూ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రిలో రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌లకు కొరత లేదని, ప్రజలు ఆందోళన చెంది ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీయొద్దని సూచించారు. నగరంలోని 31 ప్రైవేటు ఆసుపత్రులకు రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు సరఫరా అవుతున్నాయని.. ఈ ఇంజెక్షన్‌లు ఏ ఏజెన్సీల నుంచి వస్తున్నాయో ఓ వివరిస్తూ బోర్డులు […]

Update: 2021-05-13 01:54 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: జిల్లాలో రెమిడెసివిర్‌, ఆక్సిజన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్‎లో కరోనా కట్టడిపై రివ్యూ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రిలో రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌లకు కొరత లేదని, ప్రజలు ఆందోళన చెంది ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీయొద్దని సూచించారు. నగరంలోని 31 ప్రైవేటు ఆసుపత్రులకు రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు సరఫరా అవుతున్నాయని.. ఈ ఇంజెక్షన్‌లు ఏ ఏజెన్సీల నుంచి వస్తున్నాయో ఓ వివరిస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. నగరంలోని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఫీజుల నియంత్రణ లేకుండా పోయిందని, కచ్చితంగా అమలు అయ్యేవిధంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి గంగుల ప్రకటించారు. ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం కలిగే విధంగా అధికారులు సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News