రైతులను కించపరిస్తే ఊరుకోం.. బండి సంజయ్‌కి గంగుల హెచ్చరిక
దిశ, కరీంనగర్ సిటీ: ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మంత్రి గంగుల మీడియాతో మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లో పండించిన వరిధాన్యం కొనుగోలు చేస్తూ.. తెలంగాణలో పండించిన వరిధాన్యంపై కేంద్రం వివక్ష చూపడం రాష్ట్ర రైతాంగాన్ని కించపరచడమే అని, అలాచేస్తే ఊరుకుదిలేదని హెచ్చరించారు. వరిధాన్యం కొనుగోలు చేయలేమని కేంద్ర వ్యవసాయశాఖ స్పష్టం చేస్తుంటే.. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. రాష్ట్ర […]
దిశ, కరీంనగర్ సిటీ: ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మంత్రి గంగుల మీడియాతో మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లో పండించిన వరిధాన్యం కొనుగోలు చేస్తూ.. తెలంగాణలో పండించిన వరిధాన్యంపై కేంద్రం వివక్ష చూపడం రాష్ట్ర రైతాంగాన్ని కించపరచడమే అని, అలాచేస్తే ఊరుకుదిలేదని హెచ్చరించారు. వరిధాన్యం కొనుగోలు చేయలేమని కేంద్ర వ్యవసాయశాఖ స్పష్టం చేస్తుంటే.. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. రాష్ట్ర రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్‌కి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి దమ్ముంటే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఇంటి ఎదుట ధర్నా చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈనెల 12న రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు తలపెట్టినట్లు తెలిపారు.
ఈ టీఆర్ఎస్ సర్కార్ తలపెట్టిన ఈ ఆందోళన కార్యక్రమానికి అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు శుక్రవారం నిర్వహించే రైతు ధర్నా ఏర్పాట్లపై ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ముఖ్య నేతలతో మంత్రి సమావేశం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా చేపట్టే ఆందోళనల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనేలా చూడాలని ఆదేశించారు. రాజ్యాంగం ప్రకారం ప్రతీ గింజను కొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. వ్యవసాయ మార్కెట్లను ప్రైవేటుకు దోచిపెట్టే కుట్రల్ని ఎండగట్టాలని, రైతులను గందరగోళంలో పడేసేలా బీజేపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా శుక్రవారం ధర్నాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, సీనియర్ నేత పెద్దిరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.