ఈటలపై మంత్రి గంగుల తీవ్ర విమర్శలు

దిశ, హుజురాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలోని కేసీ క్యాంపులో ఆర్యవైశ్య సదన్ భూమిపూజ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గజమాలతో మంత్రిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో ఈటల రాజేందర్‌కే కాదు.. ప్రజలందరికీ ఆత్మ గౌరవం ఉంటుందన్నారు. రాష్ట్రంలోని అన్ని […]

Update: 2021-07-04 05:27 GMT

దిశ, హుజురాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలోని కేసీ క్యాంపులో ఆర్యవైశ్య సదన్ భూమిపూజ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గజమాలతో మంత్రిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో ఈటల రాజేందర్‌కే కాదు.. ప్రజలందరికీ ఆత్మ గౌరవం ఉంటుందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను సమానంగా చూడాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని, ఆ ఆలోచనతోనే అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు.

రాష్ట్ర మంత్రిగా ఏడు సంవత్సరాలు ఉన్న ఈటల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఈటల ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రం అభివృద్ధి చెందాలని, పల్లెలు పట్టణాలుగా, పట్టణాలు ఆధునీకరణ చెందాలని కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నారని గుర్తు చేశారు. నియోజకవర్గంలోని ప్రధాన పట్టణాలైన జమ్మికుంట, హుజురాబాద్‌లో అభివృద్ధి జరగలేదన్నారు. అభివృద్ధి కోసం నిధులు తేవడంలో ఈటల విఫలమయ్యారన్నారు. సొంత ఎదుగుదలను చూసుకున్నాడే కానీ నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు.

హుజురాబాద్ అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రూ.35 కోట్ల నిధులను వెంటనే మంజూరు చేశారని, అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయన్నారు. అభివృద్ధి కావాలో.. వ్యక్తిగత ఆదాయం పెంచుకున్న ఈటల రాజేందర్ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు. దేశంలో నిత్యావసర ధరలు పెంచి పేదలపై భారాలు మోపుతున్న బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఆర్యవైశ్యుల ఆత్మ గౌరవం పెంచేందుకే ఆర్య వైశ్య సదన్ కు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ ఉప ఎన్నికలు ప్రభుత్వాన్ని మార్చే ఎన్నికలు కావని, హుజురాబాద్ అభివృద్ధిని మార్చే ఎన్నికలు మాత్రమే అన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా ఉచిత కరెంట్, రైతు బంధు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగాలంటే భావి తరాల భవిష్యత్తుకు బాటలు పడాలంటే సీఎం కేసీఆర్ సూచించిన అభ్యర్థిని ఉప ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ సునిల్ రావు, ఎమ్మెల్యే గణేష్ గుప్త, ఎమ్మెల్సీ దయంనద్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, వాస్తకళ చెర్మన్ బొల్లం సంపత్, టురిజం శాఖ చైర్మన్ ఉప్పుల శ్రీనివాస్ గుప్త, మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల టిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గేల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News