రైతులను వేధిస్తే ఊరుకోను: మంత్రి ఈటల
దిశ, కరీంనగర్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను వేధిస్తే ఊరుకునేది లేదని రైస్ మిల్లర్లను వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. మంగళవారం హుజురాబాద్‌లో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల మేలు కోరుతూ ఆ దిశగా ముందుకు వెళుతోందన్నారు. విపత్కర పరిస్థితుల్లో రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి అండగా నిలబడిందన్నారు. […]
దిశ, కరీంనగర్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను వేధిస్తే ఊరుకునేది లేదని రైస్ మిల్లర్లను వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. మంగళవారం హుజురాబాద్‌లో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల మేలు కోరుతూ ఆ దిశగా ముందుకు వెళుతోందన్నారు. విపత్కర పరిస్థితుల్లో రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి అండగా నిలబడిందన్నారు. ఇదంతా తెలిసి కూడా మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రేయింబవళ్లు కష్టపడి పండించిన పంటను తరుగు పేరుతో బ్లాక్ మెయిలింగ్ చేయడం మానుకోవాలని మంత్రి హితవు పలికారు. రైతులను ఎవరైనా ఇబ్బంది పెడితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని మంత్రి ఈటల స్పష్టం చేశారు.
Tags: farmers struggles, minister etela warns, rice millers, purchasing centers