పరువు భంగమేలా.. నేలరాలిన ‘ఎర్రబెల్లి’ శిలాఫలకం
దిశ, జగిత్యాల : అవినీతి, అక్రమాలకు తెలంగాణాలో అస్కారం లేదు. అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించం. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి ఎక్కువగా వచ్చే డైలాగ్. ఇదే నినాదాన్ని రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ముఖ్యనాయకులు చెప్పి చెప్పి ప్రజల గుండెల్లో నాటుకపోయేలా చేశారు. అయితే, ఈ విధానం చేతల్లో అమలువుతోందా..? నిజంగానే ప్రభుత్వం అలానే వ్యవహరిస్తోందా..? అన్నదే ప్రశ్నార్థకంలా మిగిలిపోయింది. ఆ విషయం తేలాలంటే మనం ఓసారి జగిత్యాల జిల్లాకు వెళ్ళి చూసొస్తే సరి. […]
దిశ, జగిత్యాల : అవినీతి, అక్రమాలకు తెలంగాణాలో అస్కారం లేదు. అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించం. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి ఎక్కువగా వచ్చే డైలాగ్. ఇదే నినాదాన్ని రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ముఖ్యనాయకులు చెప్పి చెప్పి ప్రజల గుండెల్లో నాటుకపోయేలా చేశారు. అయితే, ఈ విధానం చేతల్లో అమలువుతోందా..? నిజంగానే ప్రభుత్వం అలానే వ్యవహరిస్తోందా..? అన్నదే ప్రశ్నార్థకంలా మిగిలిపోయింది. ఆ విషయం తేలాలంటే మనం ఓసారి జగిత్యాల జిల్లాకు వెళ్ళి చూసొస్తే సరి.
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మూడు రోజుల కిందట జిల్లాలో పర్యటించి ఓ రహదారి నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఏడు కిలో మీటర్ల మేర వేయనున్న ఈ రోడ్డును మూడు గ్రామాలను కలుపుతూ వేయాలని నిర్ణయించారు. అయితే, మంత్రి శంకుస్థాపన చేసిన రెండు రోజుల్లోనే ఏకంగా శిలాఫలకమే నేలరాలింది. అయితే, శిలాఫలకం పరిస్థితే ఇలా ఉంటే రోడ్డు నిర్మాణం ఎలా ఉంటుందోనని జగిత్యాల జిల్లా వాసులు చర్చించుకుంటున్నారు.
జగిత్యాల రూరల్ మండలం కల్లెడలో Pmgsy (ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన) నిధులతో లింక్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే రెండు రోజులు కూడా కాకముందే మంత్రి ఘనంగా ప్రారంభించిన శిలాఫలకం ఊడిపోయింది. శిలాఫలకం పరిస్థితే ఇలా ఉంటే లింక్ రోడ్డు నిర్మాణం ఎలా ఉంటుంది సారూ.. అంటూ సోషల్ మీడియాలో జనం తెగ ట్రోల్స్ చేస్తున్నారు.