ఐసీసీ టెస్టు పాయింట్ల విధానంపై మండిపడ్డ వెస్టిండీస్ క్రికెటర్
దుబాయ్: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగే మ్యాచ్‌లకు సంబంధించిన పాయింట్ల విధానంపై వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మైఖేల్ హోల్డింగ్ ఆరోపణలు గుప్పించారు. ప్రస్తుత పాయింట్స్ సిస్టం అసలు బాగోలేదని.. ఐదు మ్యాచ్‌ల సిరీస్ గెలిస్తే వచ్చే పాయింట్లు.. కేవలం రెండు మ్యాచ్‌ల సిరీస్ గెలిచి సాధించడమేంటని ఆయన ప్రశ్నించారు. భారత జట్టు 5, 4 మ్యాచ్‌లు గెలిచి సాధించిన పాయింట్లను.. న్యూజీలాండ్ రెండు మ్యాచులే గెలిచి సాధించగలిగిందని ఆయన గుర్తు చేశారు. ఇలా అయితే […]
దుబాయ్: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగే మ్యాచ్‌లకు సంబంధించిన పాయింట్ల విధానంపై వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మైఖేల్ హోల్డింగ్ ఆరోపణలు గుప్పించారు. ప్రస్తుత పాయింట్స్ సిస్టం అసలు బాగోలేదని.. ఐదు మ్యాచ్‌ల సిరీస్ గెలిస్తే వచ్చే పాయింట్లు.. కేవలం రెండు మ్యాచ్‌ల సిరీస్ గెలిచి సాధించడమేంటని ఆయన ప్రశ్నించారు. భారత జట్టు 5, 4 మ్యాచ్‌లు గెలిచి సాధించిన పాయింట్లను.. న్యూజీలాండ్ రెండు మ్యాచులే గెలిచి సాధించగలిగిందని ఆయన గుర్తు చేశారు. ఇలా అయితే టెస్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వెళ్లే జట్లేవో ముందుగానే తెలిసిపోతుందని హోల్డింగ్ అభిప్రాయపడ్డాడు. అదే కనుక జరిగితే ఫైనల్‌కు వెళ్లలేని జట్ల మ్యాచ్‌లను ప్రేక్షకులు ఆదరించరని అన్నాడు. టెస్టు మ్యాచ్‌లను పాయింట్ల విధానమే దెబ్బతీస్తోందని మైఖేల్ స్పష్టం చేశాడు.
ఐసీసీ టెస్టు ఛాంపియన్ నిబంధనల ప్రకారం రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక మ్యాచ్ గెలిస్తే 60 పాయింట్లు లభిస్తుండగా.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక మ్యాచ్ గెలిస్తే కేవలం 24 పాయింట్లే వస్తాయి. కరోనా కారణంగా క్రికెట్ మ్యాచ్‌లు నిలిచిపోవడంతో ప్రస్తుతం టెస్టు మ్యాచులు జరగట్లేదు. టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ 2021 జూన్‌లో లార్డ్స్ వేదికగా జరగనుంది. ప్రస్తుత కరోనా సంక్షోభం నేపథ్యంలో టెస్టు మ్యాచ్‌లు జరగడం ఆలస్యమైతే ఫైనల్ వాయిదా పడే అవకాశం ఉంది.
Tags : Cricket, Test Match, ICC, Test Championship, Michael Holding, Points, Team India, West Indies