గడ్చిరోలిలో కాల్పుల మోత.. దళ కమాండర్ హతం
దిశ , కరీంనగర్: మహరాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతంలో మళ్లీ కాల్పుల మోత వినిపించింది. శుక్రవారం జరిగిన ఎన్ కౌంటర్ లో పెరమిలి దళ కమాండర్ కోటె అభిలాష్ అలియాస్ చందర్, సోమా, శంకర్ హతమయ్యాడు. ఏటాపల్లి తాలుక హెడ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని యెలదుడమి అటవీ ప్రాంతంలో సీ60 కమాండోలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టుల ఒక్కసారిగా తారసపడ్డారు. దీంతో ఇరువురి మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో తెలంగాణలోని ములుగు జిల్లా కారపల్లి […]
దిశ , కరీంనగర్: మహరాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతంలో మళ్లీ కాల్పుల మోత వినిపించింది. శుక్రవారం జరిగిన ఎన్ కౌంటర్ లో పెరమిలి దళ కమాండర్ కోటె అభిలాష్ అలియాస్ చందర్, సోమా, శంకర్ హతమయ్యాడు. ఏటాపల్లి తాలుక హెడ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని యెలదుడమి అటవీ ప్రాంతంలో సీ60 కమాండోలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టుల ఒక్కసారిగా తారసపడ్డారు. దీంతో ఇరువురి మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో తెలంగాణలోని ములుగు జిల్లా కారపల్లి గ్రామానికి చెందిన అభిలాష్ అనే దళ కమాండర్ మృతి చెందాడు. ఇతని తలపై రూ. 8 లక్షల రివార్డు మనీ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఓ తుపాకీ, వాకీటాకీలు, ప్రెషర్ కుక్కర్, 20 కిట్ బ్యాగులు, ఇతరాత్ర సామగ్రి, సాహిత్యం పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు.ఇన్నిరోజులు హిట్ లిస్టులో ఉన్న దళ కమాండర్ హతమవ్వడంతో సీ60 కమాండోలను జిల్లా ఎస్పీ శైలేష్ బల్కావుడే అభినందించారు.