మంథని టీఆర్ఎస్‌లో ముసలం.. గులాబీ పార్టీకి కీలక నేతలు గుడ్ బై..?

దిశ, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో సొంత పార్టీపై తిరుగుబావుటా ఎగరేసేందుకు సమాయత్తం అయ్యారు స్థానిక సంస్థల ప్రతినిధులు. గులాబీ జెండాను వదిలేయాలని నిర్ణయించుకున్నారు. జిల్లాలోని ముత్తారం మండల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ తీరుపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీలో నెలకొన్న అంతర్గత పోరుతో అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. మండలంలోని సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు అందరూ కూడా ఒకే తాటిపైకి రావడంతో […]

Update: 2021-11-22 10:49 GMT

దిశ, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో సొంత పార్టీపై తిరుగుబావుటా ఎగరేసేందుకు సమాయత్తం అయ్యారు స్థానిక సంస్థల ప్రతినిధులు. గులాబీ జెండాను వదిలేయాలని నిర్ణయించుకున్నారు. జిల్లాలోని ముత్తారం మండల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ తీరుపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీలో నెలకొన్న అంతర్గత పోరుతో అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. మండలంలోని సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు అందరూ కూడా ఒకే తాటిపైకి రావడంతో గులాబీ పార్టీ ఖాళీ అవడం ఖాయంగా కనిపిస్తోంది.

మా నిర్ణయానికి కారణమిదే..

టీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేసేందుకు సిద్ధమని ముత్తారం మండల సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, ముత్తారం మండలం ప్రజా ప్రతినిధులు మీడియాకు వివరించారు. టీఆర్ఎస్‌లో ఉద్యమకారులకు విలువ లేకుండా పోయిందని, కొత్తగా వచ్చిన వారి మాటలను అధిష్టానం నమ్మి పాతవారిని దూరం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముత్తారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు నూనె కుమార్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా రెండు సార్లు గెలిచిన సర్పంచులం ఉన్నా అధిష్టానం కొత్త వారిని పార్టీలో చేర్చుకుని వారి చెప్పుడు మాటలు వింటూ సీనియర్‌లమైన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను దూరం చేసుకుంటోందని ఆరోపించారు. అధిష్టానంలో మార్పు రాకుంటే ముత్తారం మండల ప్రజాప్రతినిధులు సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ సభ్యులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు అందరూ రాజీనామాకు సిద్ధమని స్పష్టం చేశారు.

Tags:    

Similar News