కరోనా నుంచి కోలుకున్న మన్మోహన్ సింగ్
న్యూఢిల్లీ : కరోనా బారినపడ్డ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కోలుకున్నారు. గురువారం ఆయన ఢిల్లీలోని ఆలిండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సైస్ (ఎయిమ్స్) నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈనెల 19 న మన్మోహన్‌కు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి ఆయన ఎయిమ్స్‌లోనే చికిత్స పొందుతున్నారు. అంతకుముందు రోజే దేశంలో కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయడం గమనార్హం. మన్మోహన్ కోలుకోవాలని ప్రార్థించిన ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు ధన్యవాదాలు […]
న్యూఢిల్లీ : కరోనా బారినపడ్డ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కోలుకున్నారు. గురువారం ఆయన ఢిల్లీలోని ఆలిండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సైస్ (ఎయిమ్స్) నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈనెల 19 న మన్మోహన్‌కు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి ఆయన ఎయిమ్స్‌లోనే చికిత్స పొందుతున్నారు. అంతకుముందు రోజే దేశంలో కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయడం గమనార్హం. మన్మోహన్ కోలుకోవాలని ప్రార్థించిన ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు.