మరో క్రేజీ చాన్స్ కొట్టేసిన మాళవిక
దిశ, వెబ్‌డెస్క్ : బ్యూటిఫుల్ మాళవిక మోహనన్ తమిళ్‌లో జెండా పాతేస్తుందనే అనిపిస్తోంది. ఇప్పటికే సూపర్ స్టార్ విజయ్ ‘మాస్టర్’ సినిమాలో సూపర్ డూపర్ చాన్స్ కొట్టేసి, తమిళ్‌లో స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటాలని ఎదురుచూస్తున్న టైమ్‌లో.. మరో క్రేజీ చాన్స్ వచ్చేసింది. ఎన్ని అవకాశాలు వచ్చినా ఇప్పటి వరకు కాదనుకున్న భామ.. ఆచి తూచి నిర్ణయించి ఫైనల్‌గా స్టార్ హీరో ధనుష్‌తో సినిమా ఓకే చేసింది. అందాల భామ మాళవిక.. ధనుష్ 43వ సినిమాలో హీరోయిన్‌గా […]
దిశ, వెబ్‌డెస్క్ : బ్యూటిఫుల్ మాళవిక మోహనన్ తమిళ్‌లో జెండా పాతేస్తుందనే అనిపిస్తోంది. ఇప్పటికే సూపర్ స్టార్ విజయ్ ‘మాస్టర్’ సినిమాలో సూపర్ డూపర్ చాన్స్ కొట్టేసి, తమిళ్‌లో స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటాలని ఎదురుచూస్తున్న టైమ్‌లో.. మరో క్రేజీ చాన్స్ వచ్చేసింది. ఎన్ని అవకాశాలు వచ్చినా ఇప్పటి వరకు కాదనుకున్న భామ.. ఆచి తూచి నిర్ణయించి ఫైనల్‌గా స్టార్ హీరో ధనుష్‌తో సినిమా ఓకే చేసింది.
అందాల భామ మాళవిక.. ధనుష్ 43వ సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయింది. కార్తీక్ నరేన్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాను సత్యజోతి ఫిల్మ్స్ బ్యానర్‌పై టి.జి. త్యాగరాజన్ సమర్పిస్తుండగా.. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న సినిమాలో మాళవికకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్తోంది మూవీ యూనిట్. కాగా మాళవిక మోహనన్ ఇప్పటికే కన్నడ, మలయాళ భాషల్లో సూపర్ బిజీ కాగా, ఇప్పుడు తమిళ్‌లోనూ బిజీ హీరోయిన్ అయిపోనుంది.
https://twitter.com/karthicknaren_M/status/1322501166475866113?s=19