‘హుజురాబాద్ కోసం మోడీ కాళ్లు మొక్కిన కేసీఆర్’
దిశ, జగిత్యాల: హుజురాబాద్ ఉపఎన్నికను వాయిదా వేయాలని ప్రధాని మోడీ కాళ్ల మీద.. సీఎం కేసీఆర్ పడ్డారంటూ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు ముఖ్య అతిథిగా హాజరైన మధు యాష్కీ టీఆర్‌ఎస్ సర్కార్‌పై విమర్శలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే ఢిల్లీ టూర్ వేశారన్నారు. బీజేపీ-టీఆర్ఎస్ రాజకీయాలతో సామాన్య […]
దిశ, జగిత్యాల: హుజురాబాద్ ఉపఎన్నికను వాయిదా వేయాలని ప్రధాని మోడీ కాళ్ల మీద.. సీఎం కేసీఆర్ పడ్డారంటూ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు ముఖ్య అతిథిగా హాజరైన మధు యాష్కీ టీఆర్‌ఎస్ సర్కార్‌పై విమర్శలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే ఢిల్లీ టూర్ వేశారన్నారు. బీజేపీ-టీఆర్ఎస్ రాజకీయాలతో సామాన్య ప్రజలు జీవించలేకపోతున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారంటూ మధు యాష్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు ఇస్తానన్న మూడు ఎకరాల భూమి ఏమైందన్నారు. కేజీ టు పీజీ విద్య ఊసేలేదని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా మధు యాష్కీ పిలుపునిచ్చారు.