విటమిన్ ‘డి’ లోపంతో ‘క్యాన్సర్’ ముప్పు
దిశ, ఫీచర్స్ : సూర్యరశ్మి తాకితే శరీరంలో ‘విటమిన్ డి’ ఉత్పత్తవుతుందని తెలిసిన విషయమే. కానీ ఎంతోమంది రకరకాల కారణాల వల్ల ఉదయపు సూర్యకిరణాలను మిస్ అవుతున్నారు. ఇమ్యూనిటీ పెంచడంలోనే కాదు, కరోనా వైరస్ ఎదుర్కోవడంలోనూ విటమిన్ డి పాత్ర ఉంది. ఇది తక్కువగా ఉంటే ఎన్నో రోగాలు అటాక్ చేస్తాయని వైద్యులు ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటారు. ఇక ఎండ ఎక్కువగా తగలకపోవడం వల్ల చాలామందికి కొలొరెక్టల్ క్యాన్సర్ వస్తోందని కాలిఫోర్నియా శాన్‌డియాగో పరిశోధకులు తాజాగా వెల్లడించారు. 186 […]
దిశ, ఫీచర్స్ : సూర్యరశ్మి తాకితే శరీరంలో ‘విటమిన్ డి’ ఉత్పత్తవుతుందని తెలిసిన విషయమే. కానీ ఎంతోమంది రకరకాల కారణాల వల్ల ఉదయపు సూర్యకిరణాలను మిస్ అవుతున్నారు. ఇమ్యూనిటీ పెంచడంలోనే కాదు, కరోనా వైరస్ ఎదుర్కోవడంలోనూ విటమిన్ డి పాత్ర ఉంది. ఇది తక్కువగా ఉంటే ఎన్నో రోగాలు అటాక్ చేస్తాయని వైద్యులు ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటారు. ఇక ఎండ ఎక్కువగా తగలకపోవడం వల్ల చాలామందికి కొలొరెక్టల్ క్యాన్సర్ వస్తోందని కాలిఫోర్నియా శాన్‌డియాగో పరిశోధకులు తాజాగా వెల్లడించారు.
186 దేశాల డేటాను ఉపయోగించి అంతర్జాతీయ పరిశోధకుల బృందం నిర్వహించిన అధ్యయనం ప్రకారం, సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత ‘బీ’ (యూవీబీ) కాంతి తగినంతగా శరీరానికి తగలక పోవడంతో పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు వెల్లడైంది. ఈ ఫలితాలను ఓపెన్-యాక్సెస్ జర్నల్ BMC పబ్లిక్ హెల్త్‌లో ప్రచురించారు. అమెరికాలోని కాలిఫోర్నియా శాన్‌డియాగో విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు కొన్ని సంవత్సరాలుగా యూవీబీ లైట్, కొలొరెక్టల్ క్యాన్సర్ మధ్య సంబంధాన్ని తెలుసుకోవడానికి పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల్లో 45 ఏళ్లు పైగా ఉన్నవారిలో యూవీబీ కిరణాలు లోపించడానికి, క్యాన్సర్ ముప్పు పెరిగేందుకు దగ్గరి సంబంధం ఉన్నట్లు గుర్తించామని స్పష్టంచేశారు.
ఆరోగ్యం, యూవీబీ ఎక్స్‌పోజర్‌ను ప్రభావితం చేసే ఇతర అంశాల(ఎండవేడి, ఓజోన్ స్థాయి, ప్రజల ఆహారవ్యవహారాలు, పొగతాగుట, సగటు ఆయుఃప్రమాణాలు)పై వారు 148 దేశాలకు డేటాను సేకరించారు. ఈ డేటా ఆధారంగా అతినీలలోహిత కిరణాలు తక్కువగా ఉండే నార్వే, డెన్మార్క్, కెనడా తదితర దేశాలతో పాటు, ఎండలు ఎక్కువగా ఉండే సూడాన్, నైజీరియా, ఇండియా, యూఏఈ దేశాలతో పోల్చి చూశారు. విటమిన్ డీ అవసరమైన మేరకు అందితే మాత్రం క్యాన్సర్ ముప్పు తగ్గించుకోవచ్చునని స్పష్టంచేశారు. కొలొరెక్టల్ క్యాన్సర్‌తో యూవీబీ, విటమిన్ డీ మధ్య సంబంధాన్ని మరింత వివరంగా అర్థం చేసుకోవడానికి మరిన్ని పరిశోధనలు అవసరమన్నారు.
తక్కువ యూవీబీ ఎక్స్‌పోజర్ విటమిన్ డి స్థాయిలను తగ్గిస్తుందని పరిశోధకులు సూచిస్తున్నారు. ప్రతి వ్యక్తికి రోజుకు వెయ్యి నుంచి 2వేల యూనిట్స్ “డి విటమిన్” అవసరమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. చర్మానికి హాని లేకుండా, ఎంత మోతాదులో సూర్యరశ్మి పొందాలో అనేది కచ్చితంగా చెప్పలేం కానీ ఒక్కో వ్యక్తికి ఒక్కో మోతాదు సూర్యరశ్మి తప్పనిసరి కావాలి. మన దేశంలో 85శాతం మంది “డి విటమిన్‌లోపం”తో బాధపడుతుండగా.. ఢిల్లీలో ఏకంగా 90శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టు ఓ సర్వేలో వెల్లడైంది. హైదరాబాద్‌లోనూ 85శాతం మందికి డి విటమిన్ లోపమున్నట్లు ఆ సర్వేలో తేలింది.