ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
దిశ, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన రాజు, నిచిత (16) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇద్దరు ఇంట్లోచి వెళ్లిపోయారు. మానేరు వాగులో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు గమనించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇరువురిని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిచిత పరిస్థితి […]
దిశ, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన రాజు, నిచిత (16) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇద్దరు ఇంట్లోచి వెళ్లిపోయారు.
మానేరు వాగులో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు గమనించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇరువురిని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిచిత పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే రాజు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.