విలువైన కార్లలో డబ్బులు, మద్యం సరఫరా.. కాంగ్రెస్ అభ్యర్థి కావడంతో అధికారుల నిర్లక్ష్యం?

తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసి పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ కూతురు గిరిజ వార్తల్లో నిలిచారు.

Update: 2024-05-12 02:12 GMT

దిశ, కామారెడ్డి: తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసి పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ కూతురు గిరిజ వార్తల్లో నిలిచారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా స్థానికంగా నివాసం ఉంటూ విలువైన కార్లలో డబ్బు, మద్యం పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేస్తోందని పలువురు స్థానికులు ఆమెపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక అధికారులు పోలీసుల సహకారంతో ఆమె నివాసం ఉంటోన్న హోటల్ వద్ద తనిఖీలు నిర్వహించారు. అయితే.. సంబంధిత అధికారుల బృందం ఇక్కడికి వచ్చేసరికి ఎంపీ అభ్యర్థి కూతురుకు సంబంధించిన వాహనాలన్నీ అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. వచ్చిన అధికారులు కూడా వెంటనే తనిఖీలు ప్రారంభించకుండా పార్కింగ్‌లో గంటల తరబడి వేచి ఉన్నారు. ఎంతకూ అధికారుల నుంచి అనుమతులు రాకపోవడంతో వెనుదిరిగి వెళ్ళిపోయారు. దీంతో ఫిర్యాదు చేసిన స్థానికులు అధికారుల తీరు చూసి అసహనం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన వారు కావడంతోనే నామమాత్రపు తనిఖీలు చేసినట్లుగా అనుమానిస్తున్నారు. తనిఖీలకు వచ్చిన అధికారులు నిస్పక్షపాతంగా తనిఖీలు చేసి ఉంటే భారీగా నగదు పట్టుబడేదని చర్చించుకుంటున్నారు.

Full View


Tags:    

Similar News