Abhishek Manu Singhvi: హైదరాబాద్‌కు చేరుకున్న కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధి

తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్న అభిషేక్ మను సింఘ్వి హైదరాబాద్ కు చేరుకున్నారు.

Update: 2024-08-18 08:16 GMT
Abhishek Manu Singhvi: హైదరాబాద్‌కు చేరుకున్న కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధి
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్న అభిషేక్ మను సింఘ్వి హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ ఆయనకు స్వాగతం పలికారు. సంఘ్వి అక్కడి నుంచి ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు నివాసానికి వెళ్లనున్నారు. సాయంత్రం నానాక్ రామ్ గూడలోని ప్రైవేట్ హోటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సీఎల్పీ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో మను సింఘ్విని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు రేవంత్ రెడ్డి పరిచయం చేయనున్నారు. అనంతరం కొత్త ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్ధేశం చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం మను సింఘ్వి రాజ్యసభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తరుపున నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా తెలంగాణలోన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీనియర్ నాయకులు కె. కేశవరావు రాజీనామా చేయడంతో సెప్టెంబర్ 3న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి పోటీ చేయనున్నారు. 

Tags:    

Similar News