NHRC: అచ్యుతాపురం ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్.. డీజీపీ, సీఎస్‌కు కీలక ఆదేశాలు

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 18 మంది దుర్మరణం పాలయ్యారు.

Update: 2024-08-23 09:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 18 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఈ దుర్ఘటనలో సుమారు 40 మందికిపైగా గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరికి అనకాపల్లి, విశాఖ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే జరిగిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) స్పందించింది. ఈ మేరకు సుమోటోగా కేసు నమోదు చేస్తూ.. రాష్ట్ర డీజీపీ, చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా రెండో వారాల్లోగా దుర్ఘటనప సమగ్ర నివేదకను ఇవ్వాలని ఆదేశించింది. ఎఫ్ఐఆర్ స్టేటస్ రిపోర్టును వెంటనే అందజేయాలని సూచించింది. ప్రమాదంలో గాయపడిన వారికి అందుతున్న వైద్య సాయంపై ఆరా ఎన్‌హెచ్ఆర్సీ ఆరా తీసింది.

Tags:    

Similar News