రేపు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్
రానున్న లోక్‌సభ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎలక్షన్ కమిషన్ శనివారం మధ్యాహ్నం 3.00 గంటలకు విడుదల చేయనున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న లోక్‌సభ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎలక్షన్ కమిషన్ శనివారం మధ్యాహ్నం 3.00 గంటలకు విడుదల చేయనున్నది. లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికలకు కూడా షెడ్యూలును ప్రకటించనున్నది. కొత్తగా బాధ్యతల్లోకి వచ్చిన ఇద్దరు కమిషనర్లతో కలిసి శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో షెడ్యూలును చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, జమ్ము కశ్మీర్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా లోక్‌సభ ఎన్నికలతో పాటే ఖరారు చేస్తున్నది ఎన్నికల సంఘం. గత లోక్‌సభ ఎన్నికలను మార్చి 10వ తేదీన ప్రకటించగా ఈసారి మాత్రం ఆరు రోజులు ఆలస్యంగా ప్రకటిస్తున్నది. గత ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 23న కంప్లీట్ కావడంతో నెలాఖరుకే కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. గత ఎన్నికలు ఏడు ఫేజ్‌లలో కంప్లీట్ అయింది. ఈసారి వేసవి తీవ్రత దృష్ట్యా ఎన్ని దశల్లో ఉంటుందనేది ఆసక్తికరంగా మారిది.