RS ప్రవీణ్ కుమార్‌కు BIG షాక్.. నాగర్‌కర్నూల్‌లో BSP నుంచి కీలక నేత పోటీ
పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. లోక్‌సభ టికెట్ ఆశించిన నేతలు.. పొద్దున ఒక పార్టీలో కనిపిస్తే.. సాయంత్రానికి మరో పార్టీ కండువాతో దర్శనమిస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. లోక్‌సభ టికెట్ ఆశించిన నేతలు.. పొద్దున ఒక పార్టీలో కనిపిస్తే.. సాయంత్రానికి మరో పార్టీ కండువాతో దర్శనమిస్తున్నారు. దీంతో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. తాజాగా నాగర్ కర్నూల్ కాంగ్రెస్ టికెట్ ఆశించిన మంద జగన్నాథం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మల్లు రవికి టికెట్ కేటాయించడంతో అసంతృప్తిగా ఉన్న జగన్నాథం బీఎస్పీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన మాయవతిని కలిసేందుకు ఢిల్లీకి పయణమయ్యారు. బీఎస్‌పీ నుంచి నాగర్‌కర్నూల్ ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే జగన్నాథం ప్రకటించారు. బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇది పెద్ద దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ ఓట్లతో పాటు బీఎస్పీ ఓట్లు కూడా తనకు ప్లస్ అవుతాయని ఆర్ఎస్‌పీ భావించారు. అనూహ్యంగా బీఎస్పీ నుంచి తాను పోటీ చేయబోతున్నానని మంద జగన్నాథం ప్రకటించడంతో నియోజకవర్గంలో పోటీ ఆసక్తిగా మారింది. కాగా, గతంలో నాలుగు సార్లు ఎంపీగా గెలిచి జగన్నాథం రికార్డు సృష్టించారు.
కాంగ్రెస్‌ను వీడిన మందా జగన్నాథం.. బీఎస్పీలోకి ఎంట్రీ
— Telugu Scribe (@TeluguScribe) April 16, 2024
నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశించిన మందా జగన్నాథం.. మల్లు రవికి ఇవ్వడంతో కాంగ్రెస్‌ను వీడిన మందా.
బుధవారం ఉదయం బీఎస్పీ అధినేత్రి మాయావతి సమక్షంలో బీఎస్పీలో చేరి నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేస్తానన్న మందా జగన్నాథం pic.twitter.com/GZ9AAcMTuC