KCR బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు.. ఈసీకి బీఆర్ఎస్ స్పెషల్ రిక్వెస్ట్ ఇదే!
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. బస్ యాత్రకు సంబంధించి శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వాసుదేవ రెడ్డి అనుమతి తీసుకున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. బస్ యాత్రకు సంబంధించి శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వాసుదేవ రెడ్డి అనుమతి తీసుకున్నారు. ఈ నెల 22 నుంచి మే 10వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఎన్నికల సందర్భంగా అధికారులందరూ ఈసీ పరిధిలోకి వస్తారు కాబట్టి యాత్రకు సంబంధించి తగు భద్రత చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యాత్రలో పోలీసు సహకారం అందేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతాల్ని గుర్తించి వాటిపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టాలని.. అవసరమైతే కేంద్ర బలగాలను మొహరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ కార్యకర్తలపై, సోషల్ మీడియా వారియర్స్‌పై దాడులు చేస్తూ, తాము కడుతున్న ఫ్లెక్సీలను, బ్యానర్స్‌ను తొలగిస్తున్నదని.. దీనిపై దృష్టి పెట్టాలని రిక్వెస్ట్ చేశారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేదు, పేరుకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టినా ఎక్కడా కొనట్లేదు. రోజుల తరబడి రైతులు వేచి చూస్తున్నారని ఆవేదన చెందారు. రైతులకు పండించిన పంటలకు ఎమ్మెస్పీ ధరకే కొనాలని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మాటాలు ఒట్టి మాటలే అయ్యాయని విమర్శించారు. తక్కువ ధరకే రైతులు ధాన్యాన్ని అమ్ముతున్నారని అన్నారు. ఇస్తానన్న 500/ బోనస్ మాటే లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయిందని విమర్శించారు. లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
Read More...
BRSకు బిగ్ షాక్.. కారు దిగేందుకు పది మంది కార్పొరేటర్లు రెడీ!