భైంసాలో ఉద్రిక్తత.. కేటీఆర్‌ను అడ్డుకున్న హనుమాన్ భక్తులు
పార్లమెంట్ ఎన్నికల వేళ భైంసా పట్టణంలో ఉత్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ భైంసా పట్టణంలో ఉత్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో పర్యటిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు అనూహ్య పరిణామం ఎదురైంది. ఒక్కసారిగా హనుమాన్ భక్తులు కేటీఆర్ చుట్టుముట్టి పర్యటించకుండా అడ్డుకున్నారు. గతంలో రాముడిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అడ్డగించారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి భారీగా చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపుతప్పకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆందోళన కారులను, బీఆర్ఎస్ శ్రేణులను చెదరగొట్టి కేటీఆర్‌కు భద్రత కల్పించారు. అయితే, పరిస్థితులు అనుకూలించని నేపథ్యంలో కేటీఆర్ కార్నర్ మీటింగ్‌ను వాయిదా వేసుకున్నారు.
Read More...
ఆర్బీఐ డేటా ఆధారంగా కేసీఆర్ చేసిన అభివృద్ది ఇదే!.. కేటీఆర్ సెన్సేషనల్ ట్వీట్