బీజేపీలోకి మాజీమంత్రి.. ఆహ్వానించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్
పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌లు పెద్దిరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా బీజేపీలో చేరాలని ఆహ్వానించారు. వారి రిక్వెస్ట్ మేరకు బీజేపీలో చేరేందుకు పెద్దిరెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకటి, రెండ్రోజుల్లో చేరిక తేదీని ప్రకటిస్తానని వెల్లడించారు. కాగా, 1994, 99లో జరిగిన ఎన్నికల్లో పెద్దిరెడ్డి హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కార్మిక నాయకుడికిగా పేరు సంపాదించుకున్న పెద్దిరెడ్డి.. గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలోనూ పనిచేశారు. కాగా, ఇప్పటికే పెద్దిరెడ్డి బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను గులాబీ బాస్ కేసీఆర్‌కు పంపించారు. రాజీనామా సమయంలో ఉమ్మడి జిల్లాలో మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి.. తనకు కేసీఆర్ ఏనాడూ ప్రాధాన్యత ఇవ్వలేదని పెద్దిరెడ్డి ఆవేదన చెందారు.
Read More..
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు.. రేవంత్ రెడ్డి ఆరోపణల నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ కౌంటర్