ఎదురుపడిన బీజేపీ, MIM ఎంపీ అభ్యర్థులు.. రెచ్చిపోయిన ఇరు పార్టీ శ్రేణులు
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ వేళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎమ్ఐఎమ్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఎదురుపడ్డారు.
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ వేళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎమ్ఐఎమ్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఎదురుపడ్డారు. ఈ ఘటన మీర్‌పేట్‌లో చోటుచేసుకుంది. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్త వాతావరణాన్ని తలపించింది. ఇరు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఎటూ కదలనీయకుండా కార్యకర్తలు ఇద్దరు అభ్యర్థుల వాహనాలు చుట్టుముట్టారు. విషయం తెలిసిన వెంటనే స్పాట్‌కు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ఇద్దరు అభ్యర్థుల వాహనాలను అక్కడ నుంచి పంపించివేశారు. మరోవైపు పోలింగ్ వేళ మాధవీలత వ్యవహారశైలి విమర్శలకు తెర తీసింది. ఓ పోలింగ్ కేంద్రంలో మాధవీలత ఓటు వేయడానికి వచ్చిన ముస్లిం మహిళలతో వివాదాస్పదంగా వ్యవహరించారు. పోలింగ్ కేంద్రంలో బురఖా ధరించి కనిపించిన ముస్లిం మహిళల ఓటరు కార్డులను ఆమె తనిఖీ చేశారు. ఆ సమయంలో వారి బురఖాను తొలగించాలంటూ ఆదేశించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ.. మాధవీలత ఉదంతంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించినట్లు తేలడంతో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Read More..