AP Results: 152 స్థానాల్లో కూటమి ప్రభంజనం.. ఆ జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ

ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి.

Update: 2024-06-04 06:45 GMT

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మొదటి 5 రౌండ్‌లు ముగిసేసరికి 152 స్థానాల్లో కూటమి అభ్యర్థుల ఆథిక్యంతో దూసుకెళ్తున్నారు. ఇక పార్టీల వారీగా చూస్తే.. 127 స్థానాల్లో టీడీపీ గెలుపు దిశగా దూసుకెళ్తోంది. అలానే 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన 19 స్థానాల్లో లీడ్‌తో కొనసాగుతోంది.

ఇక 6 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంతో ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన వైసీపీ ఈ ఎన్నికల్లో ప్రస్తుతం 23 స్థానాలకే పరిమితమై ఉంది. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాలో అసలు వైసీపీ ఖాతా తెరవనేలేదు. 


Similar News