దుర్వాసన తట్టుకోలేకపోతున్నాం.. వెంటనే చికెన్ సెంటర్ తొలగించండి
దిశ, మల్లాపూర్: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని 4వ వార్డులో ఉన్నటువంటి ఎంసీపీ చికెన్ సెంటర్ నిర్వాహకులపై స్థానికులు గొడవకు దిగారు. రోజూ చికెన్ సెంటర్‌లో అధికంగా కోళ్లు కోసి, వ్యర్థాలను డ్రైనేజీలో వేయడం మూలంగా దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు ఏర్పడి అనారోగ్యాల బారిన పడుతున్నామని వాపోయారు. ఈ నేపథ్యంలోనే అక్కడినుంచి వెంటనే చికెన్ షాపు తొలగించాలని నిర్వాహకులతో గొడవకు దిగారు. అంతేగాకుండా.. దీనిపై పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని తెలిపారు. కాలనీలోని డ్రైనేజీ […]
దిశ, మల్లాపూర్: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని 4వ వార్డులో ఉన్నటువంటి ఎంసీపీ చికెన్ సెంటర్ నిర్వాహకులపై స్థానికులు గొడవకు దిగారు. రోజూ చికెన్ సెంటర్‌లో అధికంగా కోళ్లు కోసి, వ్యర్థాలను డ్రైనేజీలో వేయడం మూలంగా దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు ఏర్పడి అనారోగ్యాల బారిన పడుతున్నామని వాపోయారు. ఈ నేపథ్యంలోనే అక్కడినుంచి వెంటనే చికెన్ షాపు తొలగించాలని నిర్వాహకులతో గొడవకు దిగారు. అంతేగాకుండా.. దీనిపై పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని తెలిపారు. కాలనీలోని డ్రైనేజీ చాలా చిన్నదని, సఫాయి కార్మికులు సైతం ఎప్పుడో ఒకసారి వస్తారని, దీంతో ముక్కులు పగిలిపోయేలా వస్తోన్న వాసనను తట్టుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన చికెన్ షాపు నిర్వాహకుడు ‘‘ఇక్కడినుంచి చికెన్ సెంటర్ తొలగించేది లేదు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి’’ అని సమాధానం ఇచ్చినట్లు స్థానికులు వివరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.