పల్లె ప్రగతిలో మంత్రి ఎర్రబెల్లికి ప్రశ్నల వర్షం..
దిశ, హుజురాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పెద్దపాపయ్య పల్లి పల్లెప్రగతి సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై స్థానికులు ప్రశ్నల వర్షం కురింపించారు. రైతులు ఎవరికీ రుణమాఫీ జరగలేదని, ఇండ్లు మంజూరైనా ఎందుకు కట్టించలేదని పెద్దపాపయ్య పల్లికి చెందిన రాజిరెడ్డి అనే వ్యక్తి మంత్రిని ప్రశ్నించారు. ఇల్లు ఇవ్వాలంటూ మరో మహిళ మంత్రి సభలో నినాదాలు ఇచ్చారు. అయితే, ప్రభుత్వం కట్టించాల్సిన ఇండ్లను ఇక్కడి స్థానిక నాయకుడు పట్టించుకోలేదని మంత్రి సమాధానం ఇవ్వడం గమనార్హం. […]
దిశ, హుజురాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పెద్దపాపయ్య పల్లి పల్లెప్రగతి సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై స్థానికులు ప్రశ్నల వర్షం కురింపించారు. రైతులు ఎవరికీ రుణమాఫీ జరగలేదని, ఇండ్లు మంజూరైనా ఎందుకు కట్టించలేదని పెద్దపాపయ్య పల్లికి చెందిన రాజిరెడ్డి అనే వ్యక్తి మంత్రిని ప్రశ్నించారు. ఇల్లు ఇవ్వాలంటూ మరో మహిళ మంత్రి సభలో నినాదాలు ఇచ్చారు.
అయితే, ప్రభుత్వం కట్టించాల్సిన ఇండ్లను ఇక్కడి స్థానిక నాయకుడు పట్టించుకోలేదని మంత్రి సమాధానం ఇవ్వడం గమనార్హం. మీ స్థలాల్లోనే ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుందని, ఈ సారి బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించామని వివరించారు. కాగా, హుజురాబాద్ నియోజకవర్గం మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ది కావడం, ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత తెచ్చేందుకే మంత్రి ఎర్రబెల్లి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.