అణువేదంలా విశ్వ భాషల్లోకి
రాకపోకలు సాగిస్తుంది విస్తృతంగా
మౌనంగానో, శబ్దిస్తూనో
అనువాద సృజన నేడు
జాతీయ అంతర్జాతీయ భాషల్లో
ప్రపంచ భాషలు దాదాపుగా
తమ ఉనికిని
పాదులలోని అక్షరాలు అల్లిన పూల వాసనతో
గాలి తుంపరల్లా కలిసి
సాహితీ విశ్వంలో జీవిస్తున్నయ్
పరుగుపెట్టకపోవచ్చు
కానీ, తచ్చాడుతున్నై
ప్రపంచీకరణ నేపథ్యంలో
సర్వ సదుపాయాలున్న
కుగ్రామం కదా!
మనమున్న ప్రపంచం నేడు
అనువాదం సాహిత్యంలో రావలసినంతగా లేదనేది మాత్రం
నిజమే కాదు నిర్వివాదాంశం కూడా...
ఐతే
భాషా సాహిత్య కళలన్నీ
ఆశతో జీవిస్తున్న ప్రపంచంలో
అనువాదం శక్తివంతంగా
మరీ విస్తారంగా వెలుగుతుంది మున్ముందు
విశ్వ వారధిగా, విశ్వ సృజనగా
బలపడుతూ వర్ధిల్లుతుంది
విశ్వ వాకిలిలో కలాల కవాతుగా...
డా.టి.రాధాకృష్ణమాచార్యులు
98493 05871
Also Read...