కవిమాట

poet word

Update: 2022-12-18 18:30 GMT

'ఎంత ఆలస్యము చేస్తిని! బుద్ధి గడ్డితిన్నది. రేపటినుంచి జాగ్రత్తగా ఉంటాను. యాంటీ నాచ్‌లా పోయి సానిదాని పాట సరదాలో మనసు లగ్నమైపోయినది. ఒక్క పాట సరదాతో కుదరలేదు, మనిషి మీద కూడా సరదా పరిగెత్తుతూంది. లేకుంటే, పోకిరి మనిషివలె పాట ముగిసిన దాకా కూర్చోవడమేమిటి? ఏదో ఒక అవకాశము కలుగజేసికొని దానితో నాలుగుమాటలు ఆడడవు ఆసక్తి ఏమి? ఇదిగో లెంపలు వాయించుకుంటున్నాను. రేపటి నుంచి మరి పాటకు వెళ్లను. నిశ్చయం. నిశ్చయం… గట్టిగా పిలిచితే కమలిని లేవగలదు. మెల్లిగా తలుపు తట్టి రాముడిని లేపగల్గితినా చడి లేకుండా పక్క చేరి పెద్దమనిషి వేషము వెయ్యవచ్చును.'

-గురజాడ అప్పారావు 'దిద్దుబాటు' కథానిక నుంచి

Tags:    

Similar News

పిల్లలంటే!