మనిషి చేస్తున్న ప్రయాణంలో బాటసారికి నడక
సంతోషంగా ఉండొచ్చు
ఊగీ సాగే మనసంతా
భావోద్వేగాల పద్యం కావొచ్చు
నడిచే కాలిబాటలో గజ్జెలు
వినిపించే కాళ్ళ సవ్వడి
స్వర పేటికలో గొంతు
ధ్వనించే చప్పుడు
వేళ్ళు వేసే నిశ్శబ్ద చిటికెలు
నడిచే బాట తరగనిది
దూరం దగ్గర సహజం కదా!
నింగీ నేల వినిపించే గీతంలో...
భారమై నడుస్తున్న వేళ
ఆనందం కలలుగన్నది
మోసుకొచ్చిన దూరాన్ని
దగ్గరగా స్వప్నించే బతుకులో
చెట్టు బంధాల పరిమళం విరిసే
దూరం దగ్గర బాట గాలి కెరటాలై
డా.టి.రాధాకృష్ణమాచార్యులు
9849305871