చల్లని మంచుతెరలు పల్లెకు తెల్లని తొరణాలై
అలంకరించి పండుగని ఆహ్వానిస్తున్నాయి.
గడ్డిపొచల మీద మంచుబిందువులు
ముత్యాలై మెరుస్తున్నాయి.
ధరణి ఆకుపచ్చని చీరణికట్టినట్లు
పల్లెచుట్టూ పచ్చని పంటలు
వడ్లరాసుల కుప్పలు... తెల్లబంగారం
కర్షకుడి కష్టాన్ని దూరం చేయగా
ఇంటిల్లిపాది సంతోషాన్ని కోరి వచ్చింది సంక్రాతి.
గుమ్మంముందర రంగవల్లికలు
ఆడపడుచుల చేతిలోనుండి జాలువారిన
రంగురంగుల ముగ్గులతో ఆకిలంతా అలంకరించి
సిరులుకురిపించే పండుగను ఆహ్వానిస్తుంది.
గగనంలో గాలిపటాలు హరివిల్లులై విహారిస్తున్నాయి
ఉత్తరాయన కాలాన్ని మోసుకచ్చింది
మకరసంక్రాతి ఏడుగుర్రాల రధమెక్కి.
పాడిపంటలు పసిడిసిరులు కురిపించంగా.
భగభగమండే భోగిమంటలు
కష్టాలాన్నింటిని కాల్చివెయ్యాలి.
కాలం చలిదుప్పటి కప్పుకొని
మంచువర్షాన్ని కురిపిస్తున్నట్లు...
మనుషులజీవితాల్లో చల్లని
ఆందాలవర్షాన్ని కురిపించాలి.
రేగిపండ్లలాంటి తియ్యని
మధురస్మృతుల దారులను చూపించాలి.
తియ్యనిపిండివంటల తీపి"ధనం"
పండుగ కలకాలం మమ్మల్ని
కంటికిరెప్పలా కాపాడాలి.
సంక్రాంతి పండుగ.. మా పల్లెపండుగ.
పిండివంటల పండుగ... సంబరాల పండుగ.
తెలుగింట ముగ్గులపండుగా
మన అందరిని చల్లంగా కాపాడేపండుగ.
అశోక్ గోనె
94413 17361