మొక్కలు చెట్లు వేటికవే ఎదుగుతాయి
వాగులు సెలయేరులు వాటికవే
వంకలు తిరుగుతాయి
క్రిములు కీటకాలు తమకిష్టమైన
రొదలు చేస్తాయి
పశుపక్షాదులు తమకనువైన
నెలవులు తామేవెదుక్కుంటాయి
కొండలు పర్వతాలు తమకుతామే
రూపుదిద్ధు కున్నాయి
వీటన్నింటినీ ఉత్సుకతో
వీక్షించే మనిషి
ఆస్వాదించే ఆరాధ్యకుడు
నేడు దేనికోసమో
మరింకేదానికోసమో
వెదుకుతున్నాడా
నేడు కానరాడేమీ
ప్రకృతి ప్రేమికుడు
ప్రేమలు మరిచి పేగుబంధం తుంచి
పెనుగులాడుతున్నాడు దేంతో!
తనను తల్లిదండ్రులు
తమకంటే మిన్నగా
తీర్చి దిద్ధుతునే వున్నారు కదా!
మన ఇష్టా ఇష్టాలకు ప్రతిరూపాలు
అమ్మానాన్నలు
మన కష్టాలకి కనుచూపు మేర
పరిష్కారాలు అమ్మానాన్నలు
ఆస్తిపాస్తులు కరిగి పోయేవే
అమ్మానాన్నల ఆనవాళ్లు
మనతోకూడా మిగిలి ఉండేవే
మధురాతి మధురంగా
కడవరకు కట్టెకాలేవరకు
మనం మరుపు
కొని తెచ్చుకోకుంటే!
-రామ సుగుణాకర్ రాజు
9849375831