ఆపలేనూ కట్టేయలేను
స్వతంత్రత భాషలో పరుగు
కొత్తగా మెత్తగా భావుకత గాలి కెరటాలు
నిద్రలో కళగా మెలకువలో కల
దృశ్యం అస్పష్టం
లెక్కల్లో పటిష్టం లెక్కలేని చేతిపట్టు
నాతోనే ప్రపంచం
మాటల్లేని మర వింత మరీచికం
మనిషి లోనయనరేక నింగీ నేల నడుమ
చెట్టు చెంగుల కొమ్మ పొంగు పైకొంగు
అందాలు దాచే కనుల ప్రకృతిసోపతి
నిజంగా పిలుస్తున్నా
చూసీచూడని పొరల చూపులు
ఎవరి మనసూ పట్టని మనిషిలా
కనిపించేదే కొత్త తీరాల పరిష్వంగం
వినిపించని నశా సంచలనం
నిద్రపోనియ్యని కాలం నిద్రించదు
మనిషి నడకలో ఎంచక్కా
కుమ్మక్కై షహనాయి వాయిస్తూ
కాలనాళిక నినదిస్తూ చేతులూపి దాటేసే
వాళ్ళు చేసే పరస్పర స్నేహ రాగం
కలువని కర చిత్తాల మంచుగడ్డ
తాత్కాలికం నింగి హరివిల్లులా
మన్నించాలి ప్రియతమా!రసాలూరే
నామ్ కే వాస్తే స్పర్శ రంగుల కల
డా.టి.రాధాకృష్ణమాచార్యులు
98493 05871