హింసతో బడబాగ్నులైన గుండెల్లో
మంచు కురిసినట్లుగా
ఓ శాంతి జాతీయగీతాన్ని
మనోప్రసారంగా-మనోప్రస్థానంగా
మనోహరంగా-మహావరంగా
ఈ జగతికి ప్రసారం చేయాల్చిందే..!
అపుడే.. ఆ ఉపద్రవాల ఊబిలో దాగిన
ఆ ఉపశమనం-ఊపిరినందించి
ఆ కష్టనష్టాలను కొలిచే కొలిమిని
ఏ కాలమైనా చల్లార్చుతాయి..!!
నిలవని ప్రవాహం
నిప్పుల వాగు కాక ముందే
చేవగల చేపలు
జాలరివలలో చిక్కుకోకముందే
శాంతి కడలిలో కలిసి విశ్రాంతినిస్తాయి..!!
ఎప్పుడూ..
నీతోనే మొదలై-మొలకెత్తే విశ్వశాంతి
గడ్డుకాలంలో-గడ్డకట్టుకున్న
నిరాశల్ని నిరంతర నిరంకుశత్వాన్ని
నిర్మలత్వంగా నిర్మించుకుని
నీ చేతితోనే-నిశ్చింతగా
చితాభస్మం చేయించాలి..!!!
కందకట్ల జనార్ధన్
78936 31456
Also Read..